BigTV English

Bigg Boss 9 Telugu Day 3 Episode: గుడ్డు దొంగ సంజన.. చిచ్చు పెట్టి సినిమా చూస్తోంది, పాపం తనుజపై నిందలు

Bigg Boss 9 Telugu Day 3 Episode: గుడ్డు దొంగ సంజన.. చిచ్చు పెట్టి సినిమా చూస్తోంది, పాపం తనుజపై నిందలు

Bigg Boss 9 Telugu Day 3 Episode: బిగ్ బాస్ హౌజ్ లోకి సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కూడా కంటెస్టెంట్స్ వస్తున్నారు అని చెప్పగానే అందరిలో ఎన్నెన్నో అభిప్రాయాలు వచ్చాయి. సాధారణం సెలబ్రిటీలకు ఫైర్, యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వారిని కామనర్స్ తట్టుకోగలరా? అందరిలో సందేహం ఉండేది. కామనర్స్ పై సెలబ్రిటీల పెత్తనం ఉంటుందని ఎన్నేన్నో సందేహాలు ఉన్నాయి. కానీ, హౌజ్ లోకి వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. ఎంట్రీలోని బిగ్ బాస్ అంచనాలు తారుమారు చేశాడు. హౌజ్ ఓనర్స్ గా కామనర్స్ ని నియమించి.. సెలబ్రిటీలను టెనెంట్స్ గా పెట్టారు. అలా అయినా సెలబ్రిటీలదే పైచేయి ఉంటుందేమో అనిపించింది.


సెలబ్రిటీలకు చుక్కలు

కానీ, కామనర్సే సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తున్నారు. ఛాన్స్ దొరికితే కాదు.. టెనెంట్స్ పైకి భగ్గుమంటున్నారు. తొలి రోజు టెనెంట్స్ కి ఫుడ్ పెట్టి సింపతి చూపించారు. బిగ్ బాస్ వార్న్ చేయడంతో అంత తమ తీరు మార్చుకున్నారు. ఏ విషయంలో ఛాన్స్ తీసుకోవద్దని ఫిక్స్ అయ్యారు. అందుకే ఓనర్స్ గా.. టెనెంట్స్ ని రూల్ చేస్తున్నారు. నామినేషన్ లో హౌజ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో సంజన.. కాఫీ కావాలని అని మనిష్, ప్రియలను అడిగింది. వారు దానికి నో చెప్పారు. మెడికల్ కన్సర్న్ తప్పా మరేది తీసుకోమని, బిగ్ బాస్ ఆజ్జ లేనిదే.. తామేమి ఇవ్వమని తేల్చి చెప్పారు. ప్లీజ్ ప్లిజ్ అని వేడుకున్న వారు ససేమిరా కుదరదన్నారు. కట్ చేస్తే ఓనర్స్ గుడ్డు మిస్ అయ్యింది. నాలుగు గుడ్డుల్లో ఒకటి పోయింది.

హౌజ్ లోకి నో ఎంట్రీ

ఈ అంశాన్ని హౌజ్ ఓనర్స చాలా సీరియస్ తీసుకున్నారు. గుడ్డు ఎవరూ తీశారు అని అడిగిన ఎవరూ చెప్పలేదు. అందరు మాకు తెలియదనే సమాధానం ఇచ్చారు. టెనెంట్స్ కి హౌజ్ లోకి ఇక ఎంట్రీ లేదని ఓనర్స్ తేల్చే చెప్పేశారు. దీంతో ఈ విషయం పెద్ద చర్చ అయ్యింది. ఒకరు చేసిన తప్పుకి అందరిని పనీష్ చేయడం కరెక్ట్ కాదని వాదించారు. ఇక చివరికి ఆ గుడ్డు సంజన దొంగతనం చేసిందని తేలింది. ఆకలేసి తీసుకున్నా అంటూ కూల్ నవ్వుతూ చెప్పింది. దీంతో హౌజ్ మొత్తం ఆమెపై సీరియస్ అయ్యింది. ఈ విషయంలో ఓనర్స్, టెనెంట్స్ గ్రూప్ పెద్ద పెద్ద రచ్చ జరిగింది. మాట మాట పెరిగి.. నువ్వు నువ్వు అంటూ అరుచుకునే స్థాయికి గొడవ వెళ్లింది. కొద్ది హౌజ్ మాటల యుద్దమే జరిగింది. ఓనర్స్ నుంచి హరిష్, టెనెంట్స్ భరణి మధ్య పెద్ద వార్ జరిగింది.


భరణి, తనూజపై నిందలు

మ్యానర్స్ లేదంటూ మాటల యుద్దానికి దిగారు. వారు అలా గొడవ పడుతుంటే సంజన మాత్రం కూల్ ఓపక్కన కూర్చోని సినిమా చూస్తున్నట్టు చూసింది. టీ అడిగితే ఇవ్వలేదని, గుడ్డు చూసి టెంప్ట్ అయ్యాను.. అందుకే తీసుకుని తిన్నానని చెప్పింది. ఓనర్స్ మాత్రం మీకు తెలిసి కూడా ఎవరూ చెప్పలేదంటూ టెనెంట్స్ తో వాగ్వాదానికి దిగారు. అలా గుడ్డు దొంగలించ్చి హౌజ్ లో చిచ్చు పెట్టింది సంజన. పైగా తాను గుడ్డు తిన్నప్పుడు భరణి, తనూజ, రాము రాథోడ్ లు చూశారంటూ వారిని ఇరికించింది. దీంతో ఓనర్స్ అంతా వారిపై విరుచుకుపడ్డారు. ఓ గడ్డు.. హౌజ్ పెద్ద చిచ్చు పెట్టింది. అది తీసిన సంజన మాత్రం కూల్ గా ఉంది. ఆ తర్వాత హౌజ్ ప్రతి ఒక్కరిని నువ్వు చాలా ప్రాబ్లమ్ అవుతున్నావంటూ అంతా సంజన పై అసహనం చూపించారు. ఇక మనీష్ అయితే సంజనని ఎలిమినేట్ చేసే పవన్ ఇవ్వమని, ఆమె బిహెవిర్ అసలు భరించలేకపోతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సంజన గుడ్డు దొంగలించడంతో హౌజ్ అంత రచ్చ రచ్చ అయ్యింది. ఫైనల్ సంజన ఓనర్స్ క్షమాపణలు చెబుతూ.. ఇది ఇంత పెద్దది అవుతది అని అనుకోలేదని, నాకు తినాలిపించి తిన్నాను అంటూ కూల్ గా వివరణ ఇచ్చుకుంది.

Related News

Bigg Boss 9 Telugu Day 3 – Promo 2: ‘సుత్తి’ కొట్టిన సుమన్‌ శెట్టి.. ప్రియా వర్సెస్‌ రాము రాథోడ్‌.. కొత్త ప్రోమో అదిరింది..

Bigg Boss 9 Promo : హీట్ హీట్‌గా నామినేషన్స్… సెలబ్రెటీస్‌ను వణికిస్తున్న కామనర్స్.. దెబ్బకు కన్నీళ్లు

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.. ఆమెను టార్గెట్ చేస్తున్నారా?

Bigg Boss 9 Telugu Day 2: బ్యాక్ బిచ్చింగ్ లో అంత బూతుందా.. సంజన ఓవరాక్షన్, నామినేషన్ లో టార్గెటైన ‘బుజ్జిగాడు‘ భామ

Bigg Boss season 9 Day 2: షాంపూ కోసమో సబ్బు కోసమో, మీలో మీరు కొట్టుకు చావండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి

Big Stories

×