IND Vs UAE : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. టీమిండియా వర్సెస్ యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్ లో… సూర్య కుమార్ యాదవ్ సేన రెచ్చిపోయింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు 57 పరుగులకే… కుప్పకూలింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు. కులదీప్ యాదవ్ ఒకే ఓవర్ లో మూడు వికెట్లు… పడగొట్టడంతో యూఏఈ కోలుకోలేకపోయింది. దీంతో 13 ఓవర్లలోనే కుప్పకూలింది యూఏఈ. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. యూఏఈ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్ టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు. అయితే అతను 6 బంతుల్లో 10 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో టీమిండియా టార్గెట్ 200కి పైగానే ఉంటుందని అంతా భావించారు. కానీ కొద్ది సేపటికే టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా టీమిండియా పేసర్ బుమ్రా.. కేవలం 10 బంతుల్లోనే టీమిండియా తరపున తొలి వికెట్ ను తీసుకున్నాడు. మరోవైపు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే రెచ్చిపోవడంతో టీమిండియా యూఏఈని తక్కువ స్కోర్ కే కట్టడి చేసింది.
Also Read : Boycott IND vs PAK : టీమిండియా, పాక్ మ్యాచ్ బాయ్ కాట్…కారణం ఇదే
కేవలం 7 ఓవర్లకే యూఏఈ జట్టు కుప్పకూలిపోయింది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ ఒక్క ఓవర్ లోనే మూడు వికెట్లను తీసి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. మరోవైపు దూబే కూడా వారిపై రెచ్చిపోవడంతో చేసేది ఏమి లేకపోవడంతో యూఏఈ బ్యాటర్లు క్యూ కట్టారు. తొలుత ఓపెనర్ షారూఫ్ ని జస్ప్రిత్ బుమ్రా ఔట్ చేయగా.. ఆ తరువాత వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, దూబె ఇలా వరుసగా వికెట్లు తీయడంతో కేవలం 57 పరుగులకే యూఏఈ ఆలౌట్ అయింది. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే అద్భుతంగా బౌలింగ్ చేశారు. కుల్దీప్ యాదవ్ కేవలం ఒక్క ఓవర్ లోనే 3 వికెట్లు తీయడం విశేషం,. చాలా వరకు ఎల్బీడబ్ల్యూ, బౌల్డ్ నే ఎక్కువగా అయ్యారు. నలుగురు ఆటగాళ్లు మాత్రమే క్యాచ్ ఔట్ అయ్యారు. మిగతా వారంత బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరగడం విశేషం.
UAE ఆటగాళ్ల బ్యాటింగ్ ని పరిశీలించినట్టయితే ఓపెనర్ షారూఫ్ 22 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో తొలి వికెట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కెప్టెన్ ముహమ్మద్ వాసీం 19 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడ్ల్యూ గా వెనుదిరిగాడు. జోహబ్ 02 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో కుల్దీప్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. రాహుల్ చోప్రా(3) కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లోనే ఔట్ అయ్యాడు. అసిఫ్ ఖాన్ (2), హర్షిత్ కౌశిక్ (2), ధ్రువ్ పర్షార్ 1, సిమ్రన్ జిత్ సింగ్ 1, హైదర్ అలీ 1, జునైద్ సిద్దికీ డకౌట్ గా వెనుదిరిగారు. దీంతో టీమిండియా కి 58 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతనికి తోడు శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, అక్షర్, బుమ్రా దెబ్బకి యూఏఈని కోలుకోలేని దెబ్బ తీశారు.