OTT Movie : మలయాళం ఫ్యామిలీ డ్రామా లవర్స్‌కు మస్ట్-వాచ్‌గా నిలిచిన ఒక మూవీ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. దృశ్యం సినిమా తరువాత మోహన్‌లాల్, మీనా నటించిన ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ తెగ చూసేసారు. ఇది ఒక ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కింది. భార్యా భర్తలు పక్క చూపులు చూడటంతో అసలు స్టోరీ మొదలవుతుంది. దీనికి కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ ఫ్యామిలీ ఫిల్మ్, మోహన్‌లాల్‌కు బెస్ట్ యాక్టర్ (స్పెషల్ జ్యూరీ మెన్షన్) అవార్డులు వచ్చాయి. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్లో బెస్ట్ ఫిల్మ్ (మలయాళం), బెస్ట్ డైరెక్టర్ (జిబు జాకబ్), బెస్ట్ యాక్టర్ (మోహన్‌లాల్) నామినేషన్స్, మీనాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు గెలిచింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక చక్కని అనుభూతిని ఇస్తుంది. దీని పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
ఉలహన్నాన్ (మోహన్‌లాల్) 40 ఏళ్ల వయసులో ఉన్న ఒక సాధారణ పంచాయతీ సెక్రటరీ. కేరళలోని ఒక చిన్న టౌన్‌లో తన భార్య మరియాతో 20 ఏళ్ల వివాహ బంధంలో ఉంటాడు. ఉదయం జాబ్, సాయంత్రం ఇంటికి, ఇద్దరు పిల్లలు, అత్తమ్మ, అమ్మతో అతని లైఫ్ రొటీన్ గా ఉంటుంది. ఉలహన్నాన్‌కి ఈ జీవితం బోర్ కొడుతోంది. మరియాతో రొమాన్స్ ఎప్పుడో ఫేడ్ అయిపోయింది. అతను తన లైఫ్‌ని ఖాళీగా ఫీల్ అవుతాడు. ఈ సమయంలో ఒక కాలేజీ రీయూనియన్‌కి వెళ్లినప్పుడు, అతను పాత ఫ్రెండ్స్‌ని కలుస్తాడు. పాత మెమరీస్ రివైండ్ అవుతాయి. అక్కడ జూలీ అనే పాత క్లాస్‌మేట్‌తో ఫ్లర్ట్ చేసే సిచుయేషన్ వస్తుంది. ఇది అతని లైఫ్‌లో కొత్త ఎక్సైట్‌మెంట్ తెస్తుంది. ఉలహన్నాన్ జూలీతో అఫైర్ స్టార్ట్ చేయాలని టెంప్ట్ అవుతాడు. ఈ డెసిషన్ అతని ఫ్యామిలీ లైఫ్‌ని షేక్ చేస్తుంది.
జూలీతో అఫైర్ ట్రై చేసే ప్రాసెస్‌లో ఉలహన్నాన్ కన్ఫ్యూజన్‌లో పడతాడు. కానీ ఈ జర్నీ అతన్ని తన లైఫ్‌లో నిజమైన విలువలను రియలైజ్ చేయడానికి లీడ్ చేస్తుంది. మరియా సైలెంట్ సపోర్ట్, పిల్లల ఇన్నోసెన్స్, ఫ్యామిలీతో అతని బాండ్ ఇవన్నీ అతనికి మళ్లీ ఇంపార్టెంట్‌గా అనిపిస్తాయి. మరియాతో అతని రొమాన్స్‌ని రీకిండిల్ చేయడానికి, రొటీన్ లైఫ్‌ని బ్రేక్ చేయడానికి చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటాడు. మరియా కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కుంటుంది. అతను తీసుకునే స్టెప్స్ ఏమిటి ? మరియాతో రొమాంటిక్ లైఫ్ మొదలుపెడతాడా ? జూలీతో వ్యవహారం నడుపుతాడా ? మరియా రియలైజ్ అవుతుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
‘ముంతిరివల్లికల్ తలిర్కుంబోల్’ (Munthirivallikal Thalirkkumbol) జిబు జాకబ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళం రొమాంటిక్ కామెడీ సినిమా. దీనిని వీకెండ్ బ్లాక్‌బస్టర్స్ పతాకంపై సోఫియా పాల్ నిర్మించారు. ఇందులో మోహన్‌లాల్ (ఉలహన్నన్), మీనా, ఐష్వర్య లక్ష్మి, అంజలి నాయర్, కలభవన్ షాజోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2017 జనవరి 20న థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. ₹50 కోట్లకు పైగా వసూలు చేసింది. 2 గంటల 34 నిమిషాల రన్‌టైమ్ తో ఈ సినిమా IMDbలో 6.9/10 రేటింగ్ పొందింది. సన్ నెక్స్ట్, మనోరమా మాక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
Read Also : మొదటి రాత్రి భార్య గురించి బయటపడే షాకింగ్ సీక్రెట్… నెక్స్ట్ డే నుంచి వీడికి ఉంటదిరా చారి… లవర్స్ డోంట్ మిస్