E-Paper
Advertisement

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ
Advertisement

Jana Sena Candidates: స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ తరపున బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను జనసేన విడుదల చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమోద ముద్ర వేశారు. తొలి జాబితాలో రెండు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులను ప్రకటించింది. విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణను పవన్ కళ్యాన్ ఖరారు చేశారు.

Also Read: ‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

Advertisement

విజయవాడతో పాటు జనసేనకు దక్కిన ఏలూరు కార్పొరేషన్ అభ్యర్థిని సైతం జనసేన ప్రకటించిది. ఏలూరు మేయర్ బరిలో రెడ్డి అప్పలనాయుడు పేరును పార్టీ ఖరారు చేసింది. అలాగే 12 మున్సిపాలిటీలకు సంబంధించి అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

1. అమలాపురం: నల్లా శ్రీధర్
2. ⁠చిలకలూరిపేట: తోట రాజరాజేశ్వరి
3. ⁠గొల్లప్రోలు: కడారి తమ్మయ్య నాయుడు
4. ⁠నరసాపురం: కొత్తపల్లి శైలజ
5. నిడదవోలు: కల్లం జ్యోతి
6. పెడన: మట్టా శివపావని
7. పిఠాపురం: డాక్టర్ బీరా విజయ్ శేఖర్
8. పుత్తూరు: డి. ఏలుమలై
9. సాలూరు: గొర్లె విజయకుమారి
10. సామర్లకోట: పిట్టా జానకి రామారావు
11. తెనాలి: తోటకూర వెంకట రమణారావు
12. తిరువూరు: పి. మాధవి

Advertisement

కాగా, టీడీపీతో ఇటీవల కుదిరిన సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం.. జనసేనకు 4 కార్పొరేషన్లు దక్కాయి. అందులో తాజాగా అభ్యర్థులను ఖరారు చేసిన విజయవాడ, ఏలూరుతో పాటు శ్రీకాకుళం, కాకినాడ కార్పొరేషన్లు ఉన్నాయి. అలాగే మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు సంబంధించి 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు. దీనికి సంబంధించి తొలి జాబితాలో 12 మందిని ఖరారు చేయగా.. మిగిలిన అభ్యర్థుల పేర్లను తదుపరి జాబితాలో జనసేన ప్రకటించే అవకాశం ఉంది.

Also Read: పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

Tags

Related News

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

Big Stories

Advertisement
×