E-Paper
Advertisement

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా
Advertisement

Japanese Legal Drama Series: చట్టంపై అద్భుతమైన పట్టు… అసాధారణమైన జ్ఞాపకశక్తి… ఇతరులు గుర్తించలేని చిన్న విషయాలను సైతం గమనించే నేర్పు. ఇంత ప్రతిభ ఉన్నా, ఆటిజం కారణంగా ఓ యువ న్యాయవాదికి ఉద్యోగం దొరకకపోతే ? చివరకు ఓ ప్రముఖ న్యాయ సంస్థలో అవకాశం వచ్చినా, ఆమె సామర్థ్యంపై సహోద్యోగులే సందేహాలు వ్యక్తం చేస్తే… తన ప్రత్యేకమైన ఆలోచనా విధానంతో ఒక్కో కేసును పరిష్కరిస్తూ, తనపై ఉన్న అపోహలను తొలగించుకునే యువతి ప్రయాణమే జపనీస్‌ లీగల్‌ డ్రామా ‘ఎక్స్‌ట్రార్డినరీ అటార్నీ మినామి’ (Extraordinary Attorney Minami). మరి ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడ ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

మినామి మినమిడా చిన్నప్పటి నుంచే అసాధారణమైన తెలివితేటలు, జ్ఞాపకశక్తి కలిగిన యువతి. ఆటిజం స్పెక్ట్రమ్‌ లో ఉన్న ఆమె టోక్యో విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అత్యుత్తమ ప్రతిభతో పూర్తి చేయడమే కాకుండా, న్యాయవాద పరీక్షలోనూ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇంతటి ప్రతిభ ఉన్నప్పటికీ ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పుడు ఆమెకు అడ్డంకులు ఎదురవుతాయి. ఆటిజం గురించి సమాజంలో ఉన్న అపోహలు, ఇతరులతో మాట్లాడే తీరు, ఎదుటివారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందుల కారణంగా న్యాయవాదిగా ఆమె ఎంత వరకు రాణించగలదనే సందేహాలు వ్యక్తమవుతాయి.

Advertisement

చాలా ప్రయత్నాల తర్వాత మినామికి హిరోకావా అండ్ హోవార్డ్ అనే ప్రముఖ న్యాయ సంస్థలో అవకాశం లభిస్తుంది. అయితే ఉద్యోగం రావడంతోనే ఆమె సమస్యలు ముగిసిపోవు. క్లయింట్లతో మాట్లాడటం, అనుకోని పరిస్థితులను ఎదుర్కోవడం, సహోద్యోగులతో కలిసి పని చేయడం వంటి విషయాల్లో ఆమెకు సవాళ్లు ఎదురవుతాయి. ఆమె ప్రతిభను గుర్తించాల్సిన కొందరు, ఆమె భిన్నమైన వ్యక్తిత్వాన్నే బలహీనతగా చూస్తారు. మినామి కూడా తాను నిజంగా మంచి న్యాయవాదిగా ఎదగగలనా అనే సందేహంతో పోరాడుతుంది.

అయితే చట్టంపై ఉన్న ప్రేమ, అద్భుతమైన జ్ఞాపకశక్తి ఆమెకు అండగా నిలుస్తాయి. కేసులకు సంబంధించిన వివరాలను గుర్తుంచుకోవడం, ఇతరులు పట్టించుకోని అంశాలను తనదైన కోణంలో పరిశీలించడం ద్వారా కష్టమైన సమస్యలకు పరిష్కారాలు వెతుకుతుంది. ఒక్కో కేసులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే క్రమంలో ఆమె సహోద్యోగులతోనూ అనుబంధాలను పెంచుకుంటుంది. క్రమంగా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడంతో పాటు, తనపై తనకు నమ్మకం పెంచుకుంటుంది.

Advertisement

కేవలం కోర్టు కేసులకే ఈ కథ పరిమితం కాదు. స్నేహాలు, కుటుంబ సంబంధాలు, ప్రేమ భావనలు, తన గురించి తాను తెలుసుకునే ప్రయాణం కూడా మినామి జీవితంలో కీలకంగా మారతాయి. కొన్నిసార్లు ఆమె ఊహించని సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నింటినీ తన ప్రత్యేకమైన దృక్పథంతో ఎలా ఎదుర్కొంటుందనేదే ఈ సిరీస్‌లో ఆసక్తికరమైన అంశం.

సిరీస్ తెలుగులో ఉందా ?

‘ఎక్స్‌ట్రార్డినరీ అటార్నీ మినామి’ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకుల ముందుకు రానున్న జపనీస్‌ లీగల్‌ డ్రామా. జపాన్‌ లో ప్రసారం అక్టోబర్‌ 19 నుంచి ప్రారంభం కానుండగా, అంతర్జాతీయ నెట్‌ఫ్లిక్స్‌ విడుదల అక్టోబర్‌ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే తెలుగు ఆడియో అందుబాటులో లేదు. కానీ ఒక మంచి లీగల్ డ్రామాను చూడాలి అనుకుంటే ఈ సిరీస్ ను డోంట్ మిస్.

Read Also: బాబోయ్… రోడ్డుపై రచ్చ ఇంత డేంజరా ? మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Tags

Related News

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

థెరపీ కోసం వచ్చిన పేషెంట్‌తోనే సైకాలజిస్ట్‌కి తలనొప్పులు… నవ్వించే డార్క్ కామెడీ డ్రామా

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

Big Stories

Advertisement
×