Jogi Ramesh: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది కోర్టు. అలాగే జోగి రాముకు కూడా ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో వీరిద్దరిని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అర్థారాత్రి తర్వాత కోర్టులో జోగిరమేష్, జోగి రాములను కోర్టులో హాజరుపర్చారు ఎక్సైజ్ పోలీసులు. ఈ సందర్బంగా ప్రభుత్వం తరపున న్యాయవాది, జోగి రమేష్ తరపున న్యాయవాదుల మధ్య వేడివేడిగా వాదనలు జరిగాయి.
ఏపీ కల్తీ మద్యం కేసులో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. వైసీపీ మాజీ మంత్రి, కీలక నేత జోగి రమేశ్, సోదరుడు జోగి రాము అరెస్టు అయ్యారు.. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు (ఏ-1) వాంగ్మూలం ఆధారంగా ఎక్సైజ్ పోలీసులు జోగి రమేష్‌ను (ఏ-18) ఇరికించారు. జనార్దన్ రావు పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం, జోగి రమేష్ నకిలీ మద్యం తయారీకి రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టుకోవడానికి మద్దతు ఇచ్చాడని, ప్రతి విడతకు రూ.3-5 లక్షలు కమిషన్ తీసుకునేవాడని తెలిపారు. ఈ రాకెట్ 2022 నుంచి ఇబ్రహీంపట్నం, ములకలచెరువు ప్రాంతాల్లో వైసీపీ పాలిత కాలంలోనే ప్రారంభమైందని, జోగి రమేష్ ప్రభావంతో నడిచిందని పోలీసులు ఆరోపిస్తున్నారు.
అర్థరాత్రి 1:45 గంటలకు జోగి రమేష్, రాములకు అరెస్ట్ అయ్యారు. పోలీసులు జోగి రమేష్‌ను ముందస్తు నోటీసు లేకుండా అరెస్టు చేసి, సోదరుడు రామును కూడా అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేతలు దీనిని ‘అక్రమ అరెస్టు’గా అభివర్ణించి, చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ పక్షపాతంతో ఈ చర్య తీసుకుందని ఆరోపించారు. జోగి రమేష్ భార్యా-బిడ్డల సమక్షంలో కనక దుర్గమ్మ ఆలయంలో ప్రమాణం చేసుకుని, తనకు ఈ కేసులతో సంబంధం లేదని ప్రకటించాడు. అయితే, పోలీసులు రిమాండ్ రిపోర్టులో జోగి పేరు ప్రస్తావించకపోయినా, జనార్దన్ రావు వీడియో స్టేట్‌మెంట్‌లో ఆయన పాత్రను వెల్లడించాడు.
విజయవాడ ఎక్సైజ్ కోర్టులో ఈ రోజు తెల్లవారుజామున 1:45 గంటలకు జోగి సోదరులను హాజరు పరిచిన పోలీసులు, రిమాండ్ కోసం వాదనలు చేశారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన వాదనల తర్వాత, తెల్లవారుజామున 5 గంటలకు న్యాయమూర్తి ఈ నెల 13 వరకు రిమాండ్ విధించారు. ఈ ఆదేశాలతో పోలీసులు ఇద్దరినీ విజయవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. సిట్ అధికారులు రమేష్‌ను మరింత ఏకాంత ఉంటే ఉద్దేశ్యాన్ని ప్రశ్నించాలని, రాకెట్‌లోని ఇతర లింకులను కనుగొనాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగలు..!
వైసీపీ వర్గాలు ఈ అరెస్టును ‘డైవర్షన్ పాలిటిక్స్’గా చెబుతున్నారు. కాశీ బుగ్గ ఘటన, ఇతర సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చంద్రబాబు నాయుడు ఈ కుట్ర రచించాడని ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్, బీసీ నేతగా పార్టీలో ప్రముఖుడు, ఇబ్రహీంపట్నం నుంచి రాజకీయాల్లోకి వచ్చినవాడు. అతని అరెస్టుతో వైసీపీలో కలహాలు తలెత్తవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా. టీడీపీ ప్రభుత్వం ఈ రాకెట్‌లో మరిన్ని అరెస్టులు చేస్తుందని, మద్యం వ్యాపారంలో అక్రమాలను బహిర్గతం చేస్తుందని ప్రకటించింది.
మాజీ మంత్రి జోగి రమేష్ కు 13 వరకు రిమాండ్..
నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు రిమాండ్ విధించిన న్యాయస్థానం
అర్థరాత్రి 1.45కి న్యాయమూర్తి ముందు జోగి సోదరులను హాజరుపర్చిన పోలీసులు
రిమాండ్ రిపోర్టుపై దాదాపు 3 గంటల పాటు సాగిన వాదనలు… pic.twitter.com/D22ssXaaMy
— BIG TV Breaking News (@bigtvtelugu) November 3, 2025