Ramya Krishna Police Station Mein Bhoot: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు. ఒకప్పుడు హారర్ చిత్రాలతో బయటపెట్టిన ఆయన ఆ తర్వాత తన జానర్ని మార్చుకున్నారు. నిజ జీవిత సంఘటలను, క్రైం థ్రిల్లర్స్ చేస్తున్న ఆయన మరోసారి హారర్ సినిమా చేయబోతున్నారు. అది కూడా దిగ్గజ నటుడు మనోజ్ భాజ్పాయితో కలిసి ఇటీవల ఓ హారర్, థ్రిలర్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే ‘పోలీస్ స్టేషన్ మే భూత్’. సత్య (1998), కౌన్ (1999), శూల్ (1999) వంటి హిట్ చిత్రాలతో వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో జెనిలియా కీ రోల్ పోషిస్తుస్తోంది. తాజాగా ఈ సినిమాలో మరో అగ్రనటి కూడా భాగం కాబోతోంది. ఆమె బాహుబలి శివగామి రమ్యకృష్ణ. పోలీసు స్టేషన్ మే భూత్ లో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుందట. తాజాగా విషయాన్ని స్వయంగా దర్శకుడు ఆర్జీవీ ప్రకటించారు. రమ్యకృష్ణ లుక్ని షేర్ చేస్తూ తనదైన స్టైల్లో అనౌన్స్మెంట్ ఇచ్చాడు. “కాదు, రమ్యకృష్ణ పోలీసు స్టేషన్ మే భూత్ సినిమాల్లో నటించడం లేదు” అంటూ తన ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఆర్జీవీ తీరు తెలిసిందే. ఏ విషయాన్ని నేరుగా చెప్పరు.
అలాగే డైరెక్ట్ గా రమ్యకృష్ణ నటిస్తుందని చెప్పకుండ.. తన చిత్రంలో ఆమె నటించడం లేదంటూ ఆమె లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కూడా భాగం అవుతుందని తెలిసి మూవీపై మరింత బజ్ పెరిగింది. పాత్ర ఏదైనా దానికి 100 శాతం న్యాయం చేస్తుంది రమ్యకృష్ణ. కథలో, పాత్రలో ఏదోక ప్రత్యేకత ఉంటేనే రమ్యకృష్ణ గ్రీన్ సిగ్నిల్ ఇస్తుంది. అంటే ఈ చిత్రాన్ని ఆర్జీవీ భారీగా ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఈ సినిమాతో మళ్లీ తన మార్క్ని చూపించబోతున్నాడని అభిమానులు కూడా ఆశపడుతున్నారు.
No , @meramyakrishnan is not playing a BHOOT in POLICE STATION MEIN BHOOT pic.twitter.com/1qOPuZ9bFh
— Ram Gopal Varma (@RGVzoomin) November 3, 2025
పోలీసు స్టేషన్లో ఎన్కౌంటర్లో మరణించిన గ్యాంగ్స్టర్ దెయ్యంగా మారి పోలీసులకు వెంటాడటం వంటి బ్యాక్డ్రాప్లో ఇది సాగుతుంది. అయితే హారర్, క్రైం జానర్లో అయినా ఆరీవీ తన సినిమాలో కామెడీకి కూడా ప్రాథ్యాన్యత ఇస్తారు. సీరియస్ సాగుతూనే వినోదం అందిస్తాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మే భూత్లోనూ హారర్తో పాటు కామెడీ కూడా మిక్స్ అయినట్టు మూవీ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. కామెడీ, సీరియస్ పండించడంలో మనోజ్ భాజ్పాయి శైలి వేరు. అలాంటి లెంజెండరీ నటుడు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఇందులో జెనిలియా సైతం కీ రోల్ పోషిస్తుంది. ఇప్పుడు రమ్యకృష్ణ కూడా భాగం అవ్వడంతో మూవీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి.