Smriti Mandhana: ముంబై నవీ లోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం రోజు జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాని ఓడించి భారత మహిళల జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ లోని భారత జట్టు 52 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాని ఓడించి టైటిల్ అందుకుంది.
Also Read: Hardik Pandya: ఛాంపియన్ గా టీమిండియా.. ముంబై వీధుల్లో గంతులు వేసిన హర్ధిక్ పాండ్యా
ఈ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోర్ చేసి.. ఆ తర్వాత బౌలింగ్ లో కూడా సమిష్టిగా రాణించి వరల్డ్ కప్ ట్రోఫీ అందుకుంది. అయితే ఈ టోర్నమెంట్ లో ఐదుగురు ప్లేయర్లు అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిపించారు. కానీ టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన పై మాత్రం ప్రస్తుతం విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ లో స్మృతి మందాన సరిగ్గా ఆడలేదని.. కొన్ని మ్యాచ్ లలో మాత్రమే బాగా ఆడిందని విమర్శిస్తున్నారు. అయితే వరల్డ్ కప్ గెలిచిన అనంతరం ఆ కప్ ని పట్టుకొని తన ప్రియుడితో ఫోటోలు దిగింది స్మృతి. ఈ నేపథ్యంలో ఆ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆమెపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. సరిగ్గా ఆడకపోగా.. కప్ తో ఫోజులు కొడుతున్నావా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ టోర్నీలో స్మృతీ మందాన అద్భుతంగా రాణించింది. ఈ టోర్నీలో 9 మ్యాచ్ లలో 9 ఇన్నింగ్స్ ఆడి.. 434 పరుగులు సాధించింది. స్మృతి సగటు 54.25, స్ట్రైక్ రేట్ 99.09 గా ఉంది. ఈ ప్రదర్శనలో 50 ఫోర్లు, 9 సిక్స్ లు బాధింది. అగ్రెసివ్ షాట్లతో భారత జట్టును ముందుకు నడిపించింది. స్మృతి ఆట తీరు కారణంగానే భారత్ ఫైనల్ వరకు దూసుకెల్లగలిగింది. ఇంత అద్భుతంగా రాణించిన స్మృతీ మందానాపై ఇలా కామెంట్స్ చేయడం దారుణమని మండిపడుతున్నారు క్రీడాభిమానులు.
Also Read: Ind vs Aus: వాషింగ్టన్ సుందర్ విద్వంసం.. భారత్ ఘనవిజయం
స్మృతి మందాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. మరికొద్ది రోజుల్లో తన ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ ని ఆమె వివాహం చేసుకోబోతోంది. నవంబర్ 20న స్మృతీ మందాన పెళ్లి జరగనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి వేడుకలు మందాన సొంత ఊరు సాంగ్లీ లో జరగబోతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు వన్డే ప్రపంచ కప్ లో బిజీగా ఉన్న స్మృతి.. మరో రెండు రోజుల్లో పెళ్లి పనుల్లో నిమగ్నం కానున్నట్లు సమాచారం. ఈమె చాలాకాలంగా బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాశ్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2019 నుంచి డేటింగ్ చేస్తున్న ఈ జంట.. గత సంవత్సరం తమ ఐదవ వార్షికోత్సవం అంటూ రిలేషన్షిప్ గురించి అభిమానులతో పంచుకున్నారు. ఆ తరువాత ప్రతి వేడుకలోనూ ఇద్దరూ కలిసి కనిపించారు. తాజాగా వన్డే ప్రపంచ కప్ లో గెలిచిన అనంతరం కప్ తో దర్శనమిచ్చారు.
Smriti Mandhana & Palash Muchhal with the World Cup Trophy. ❤️
– A lovely picture. pic.twitter.com/1YbiJQGOd5
— Johns. (@CricCrazyJohns) November 3, 2025