BigTV English
Advertisement

CM Chandra Babu: పార్టీ పరువు తీస్తున్నారు.. సొంత పార్టీ నేతలపై చంద్రబాబు సీరియస్

CM Chandra Babu: పార్టీ పరువు తీస్తున్నారు.. సొంత పార్టీ నేతలపై చంద్రబాబు సీరియస్

CM Chandra Babu: ఇకపై మాటల్లేవు… మాట్లాడుకోవడాలు కూడా లేవు అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీలో హద్దు మీరి గీత దాటే నాయకులకు సరైన ట్రీట్మెంట్ ఇస్తానంటున్నారు .. రోడ్డెక్కి రచ్చ చేసి పార్టీ పరువును బజారుకీడుస్తున్న నాయకులను వదిలే ప్రసక్తి లేదంటున్నారు.. ఇకపై పార్టీ క్రమశిక్షణపై మీద ఫుల్ ఫోకస్ ఉండబోతుందని తేల్చి చెప్పిన చంద్రబాబు… ఆ క్రమంలో లండన్ పర్యటన తర్వాత పార్టీలో ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు?.. పార్టీ ఇమేజ్ ని డామేజ్ చేస్తున్న వారి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు?


పార్టీ పరువు తీస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం

ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎన్నో పోరాటాలు చేసి కూటమి గా జత కట్టి తిరిగి అధికారంలో వచ్చిన తెలుగుదేశం పార్టీకి.. సొంత పార్టీ నేతలు తీరు ఇబ్బందికరంగా మారింది.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పార్టీని అప్రతిష్ట పాలు చేసే విధంగా నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనంతో ఉన్నారట. ప్రజలు మంచి మాండేట్ ఇస్తే.. దాని కొనసాగించాల్సింది పోయి, వ్యక్తిగత విషయాలకు, గొడవలకు పోయి పార్టీ పరువు తీస్తున్నారని చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారంట.

లండన్ పర్యటన తర్వాత పూర్తిస్థాయిలో ప్రక్షాళన

ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో అక్కడి ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి ఉన్నారట.. ఇప్పటివరకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన అధినేత, ఇకపై మాట్లాడే అవసరం ఉండదు, తీవ్ర చర్యలే ఉంటాయని అని సంకేతాలు ఇస్తున్నారంట. ఎమ్మెల్యేలు కొంతమంది నాయకుల తీరు కారణం గా పార్టీకి డ్యామేజీ జరిగే అవకాశం ఉందని గ్రహించిన చంద్రబాబు ఇకపై పార్టీ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నారట.. లండన్ పర్యటన తర్వాత పార్టీలో పూర్తిస్థాయి ప్రక్షాళన చర్యలు చేపట్టబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. గీత దాటిన నాయకులకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారట .


తిరువూరు వ్యవహారం పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు వ్యవహారంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. అనుభవం లేకపోయినా, రాజకీయ కుటుంబం కాకపోయినా బాగా పనిచేస్తారనే నమ్మకంతో కొలికిపుడి శ్రీనివాసరావుకి సీట్ ఇస్తే పార్టీ పరువును బజారుకీడుస్తున్నాడని చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారట. యువతకు అవకాశం ఇవ్వాలని సంకల్పంతో సీట్ ఇస్తే పార్టీ మీద తిరగబడే పరిస్థితికి వచ్చారని నేతల వద్ద ప్రస్తావించారట చంద్రబాబు. అలాంటి వారిని ఉపేక్షిస్తే మొత్తం పార్టీకి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఎదురవుతాయని చంద్రబాబు భావిస్తున్నారట.

చంద్రబాబుకి తలనొప్పిగా మారిన తిరువూరు పంచాయితీ

అందుకే తిరువూరు పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టాలని టీడీపీ అధినేత డిసైడ్ అయ్యారట. లండన్ పర్యటన తర్వాత కొలికిపూడి శ్రీనివాసరావుని, ఎంపీ కేశినేని చిన్నిని పిలిపించి మాట్లాడి… కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంట. అందులో భాగంగానే విడివిడిగా ఎమ్మెల్యే, ఎంపీ వివరణను తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. ప్రతిపక్షాలకు లేనిపోని అవకాశాలను పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కల్పిస్తున్నారన్న అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు వ్యక్తం చేశారట.. ప్రజలకు మంచి చేసి, ప్రజలు మన్ననలు పొంది వచ్చే ఎన్నికలకు వెళదామని భావిస్తున్న చంద్రబాబుకి.. ఈ నేతల వ్యవహారం తలనొప్పిగా మారిందట..

ఎమ్మెస్ రాజు పై చంద్రబాబు ఆగ్రహం

ఇక వీటితో పాటు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా చంద్రబాబు అసంతృప్తి ఉన్నారట. సంబంధం లేని విషయాల జోలికి వెళ్లి అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని, పార్టీ పరువు తీస్తున్నారనే అభిప్రాయంలో బాబు ఉన్నారట. మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు భగవద్గీత గురించి మాట్లాడి తప్పు చేశారని, ఎమ్మెల్యేగా పరిధి దాటి మాట్లాడాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. వీటితోపాటు స్థానికంగా ఉండే పార్టీ నేతల విషయంలోనూ కొంతమంది ఎమ్మెల్యేలు ఆంటిముట్టనట్టు. వ్యవహరించడం, స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం పైన చంద్రబాబు కోపంగా ఉన్నారంటున్నారు.

కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని డిసైడ్ అయిన బాబు

అదే సందర్భంలో చాలామంది ఎమ్మెల్యేలకు తొందరపడి టికెట్లు ఇచ్చామని సీబీఎన్ భావిస్తున్నాట్లు తెలుస్తోంది. పార్టీ లేకపోతే అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎలా గెలుస్తారని అభిప్రాయాన్ని పార్టీ నేతల వద్ద ప్రస్తావించారట చంద్రబాబు. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే సొంత ఇమేజ్ తో, ఇండిపెండెంట్ పోటీ చేయాలని చంద్రబాబు అన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలు నేతలు… ఇకపై తీరు మార్చుకోకపోతే కచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని బాబు డిసైడ్ అయ్యారట..

మొత్తానికి వరస వివాదాలు నేపథ్యంలో చంద్రబాబు పార్టీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే కొంత ఆలస్యం చేశామని, ఇకపై నేతల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి పెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారంట.. లండన్ పర్యటన తర్వాత తిరువూరు తో పాటు, మరికొన్ని నియోజకవర్గాల పరిస్థితిని క్లియర్ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

 Story by Apparao, Big Tv

Related News

YS Jagan: ఈ నెల 4న తుపాను బాధిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన.. రైతులకు పరామర్శ

AP Weather: నవంబర్ 4నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

Vegetables Rates: మొంథా తుపాను ఎఫెక్ట్.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. వినియోగదారుల జేబుకు చిల్లు

Buddha Venkanna: లిక్కర్ కేసులో జగన్‌తో లింక్స్ .. బుద్దా వెంకన్న సంచలనం

Fake Liquor Case: అరెస్ట్‌పై జోగి రమేష్ భార్య శకుంతల రియాక్షన్.. అరెస్టుకు ముందు ఇదే జరిగింది?

IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. 21 మందికి కొత్త పోస్టింగ్‌లు..

Jagan Reaction: జోగి రమేష్ అరెస్టుపై జగన్ రియాక్ట్, రేపో మాపో మరికొందరు నేతలు అరెస్టయ్యే ఛాన్స్?

Big Stories

×