Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ఇంకొన్ని నెలల్లో తెలంగాణ కోడలిగా మారబోతుంది. ఏంటి.. నిజమా అంటారా.. అదేంటి ఈ మధ్యనే మన తెలంగాణ కుర్రాడు, హీరో విజయ్ దేవరకొండతో ఎంగేజ్ మెంట్ కూడా జరిగితే. అంటే చెప్పలేదు కదా అంటారా.. చెప్పకపోతే మాత్రం తెలియడం లేదా ఏంటి.. విజయ్ పేరు వినగానే అమ్మడిలో సిగ్గు. చేతికి రింగ్ ఏంటి అన్నప్పుడల్లా మీకు తెలియదా ఏంటి అని నవ్వడం.. ఇంతకుమించి ఏం చెప్పాలి. ఇక ఎంగేజ్ మెంట్ తరువాత రష్మికలో చాలానే మార్పులు వచ్చాయి.
ప్రస్తుతం రష్మిక నటిస్తున్న చిత్రాల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఒకటి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తుండగా అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నవంబర్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన రష్మిక వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది.
ఇక ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఈ చిన్నదానికి ఎదురయ్యే మొదటి ప్రశ్న.. ఎంగేజ్ మెంట్ గురించి చెప్పండి అని.. రష్మిక.. విజయ్ తో ఎంగేజ్ మెంట్ గురించి ప్రతిసారి చెప్పకనే చెప్పుకొస్తుంది. సిగ్గుతో, నవ్వుతో.. విజయ్ దేవరకొండ మాటతో.. అంటే అనుకుంటున్నారా.. తాజాగా రష్మిక తెలంగాణ భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఒకప్పుడుతన నోటి నుంచి వచ్చే తెలుగు వేరుగా ఉండేది. కానీ, ఈ మధ్య తెలంగాణ యాస వినిపిస్తుంది. థియేటర్ కు వెళ్లినా.. కూర్సున్నా.. ఏం జేయను.. నే జేయా లాంటి పదాలు రష్మిక నోటి నుంచి వినిపిస్తున్నాయి. దీంతో రౌడీ హీరో గట్టిగానే ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రష్మిక తెలంగాణ యాసతో అలా మాట్లాడుతుంటే విజయ్ నే మాట్లాడినట్లు అనిపిస్తుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా తెలంగాణకు కాబోయే కోడలు పిల్ల.. ఆ మాత్రం మాట్లాడకపోతే మజా ఏముంటుంది అని ఫ్యాన్స్ ఆటపట్టిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. త్వరలనే వీరి వివాహాం ఘనంగా జరగనుంది. మరి పెళ్ళి తరువాత రష్మిక సినిమాలు చేస్తుందో లేదో చూడాలి.
Full time Telangana Slang Rowdy Boy @TheDeverakonda ?😄🔥🔥
— NPR (@naineni9999) November 2, 2025