Telugu TV Anchors: “ఎదగాలంటే ఒదిగి ఉండాల్సిందే” అనే సామెత కాలం మారినా కూడా చెరిగిపోదు అని చెప్పవచ్చు. అందుకే అంతలేనిదే మన పెద్దవాళ్ళు ఇలాంటి సామెతలు సృష్టించరు కదా.. అయితే దీనిని కొంతమంది బ్రేక్ చేస్తున్నారు.. ఎదగాలంటే ఒదగాల్సిందే అనే సామెతను పక్కనపెట్టి టాలెంట్ ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని నిరూపిస్తున్నారు. మరికొంతమంది ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా.. కొంతమంది తొక్కేసేవారు ఉంటే వెనక్కి వెళ్ళిపోవాల్సిందే అంటూ కూడా బహిరంగంగా కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇలాంటి సమస్యలు సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో అయితే ఉన్నాయో.. ఇటు బుల్లితెర ఇండస్ట్రీలో కూడా అంతకుమించి ఉన్నాయని.. పలువురు ఫిమేల్ యాంకర్లు చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి ..ముఖ్యంగా ఒకరి తర్వాత మరొకరు బుల్లితెరపై తమకు అన్యాయం జరుగుతోందని.. ముఖ్యంగా తాము ఎదగడం ఓర్వలేక తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వారిలో మొదటిగా చెప్పుకోవాల్సింది ఝాన్సీ(Jhansi ). సీనియర్ యాంకర్ గా తన అద్భుతమైన వాక్చాతుర్యంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె సుమ (Suma) కు మించి క్రేజ్ దక్కించుకుంది. కానీ కాలక్రమేనా ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బుల్లితెర ఇండస్ట్రీకి దూరమై సినిమాలలో కొన్ని రోల్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బుల్లితెరపై ఆ రేంజ్ లో ఆమె సక్సెస్ కాకపోవడానికి కారణం ఆమెను కొంతమంది తొక్కేసారనే వార్తలు గతంలో వినిపించాయి.
ఆ తర్వాత టాలెంట్ ఉండి కూడా బుల్లితెర ఇండస్ట్రీకి దూరమైన యాంకర్స్ లో ఉదయభాను (Udayabhanu) కూడా ఒకరు. ఉదయభాను గొంతు విప్పింది అంటే ఎంతటి ఈవెంట్ అయినా సక్సెస్ అవ్వాల్సిందే. అలా తన అద్భుతమైన వాక్చాతుర్యంతో.. కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకున్న ఉదయభాను స్టార్ యాంకర్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమె ఇండస్ట్రీకి దూరమైంది. సినిమాలలో ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చింది కూడా.. అందులో భాగంగానే మాట్లాడుతూ..” కొంతమంది నేను ఎదగడం ఓర్వలేక నన్ను తొక్కేసారు. ఇక్కడ పెద్ద సిండికేట్ నడుస్తోంది. ఇక్కడ రాణించాలి అంటే అదృష్టం కూడా ఉండాలి” అంటూ చెప్పుకొచ్చింది.
also read:Shahrukh Khan: షారుక్ ఫ్యాన్స్ కి ఘోర అవమానం.. సిబ్బందిపై మండిపడ్డ కింగ్!
ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ సౌమ్య కూడా ఉదయభాను మాటలను సమర్థిస్తూ..” ఉదయభాను గారు చెప్పింది నిజమే. ఇక్కడ పెద్ద సిండికేట్ నడుస్తోంది” అంటూ సౌమ్య కూడా చెప్పింది.. నిజానికి అనసూయ వెళ్ళిపోయిన తర్వాత.. రష్మి జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలను రెండింటిని కవర్ చేయడంలో ఇబ్బంది పడుతుండడంతోనే సౌమ్యని రంగంలోకి దింపారు. కానీ సౌమ్య ని తీసేసి సిరి హనుమంత్ ని యాంకర్ గా పెట్టారు. ఆఖరికి సిరి హనుమంత్ ని కూడా తీసేసి జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండింటిని ఒకటిగా చేసి ఈ కార్యక్రమానికి ఇప్పుడు రష్మి ను మాత్రమే యాంకర్ గా పెట్టారు.
అయితే ఇప్పుడు వీరందరి లాగే మరో యాంకర్ విష్ణుప్రియ కూడా కామెంట్ చేసింది. ఇటీవల కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఈమె యాంకరింగ్ గురించి మాట్లాడుతూ.. “నాతోటి యాంకర్స్ కి నన్ను చూసి కుళ్ళు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పేరు తెచ్చేసుకుంది అని చాలామంది బాధపడ్డారు. అయితే నాకు సింగిల్ గా యాంకరింగ్ చేయడం రాదు పోవే పోరా షోలో సుధీర్ ఉన్నాడు కాబట్టి అలా నెట్టుకొచ్చాను. అయినా నా ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోయారు” అంటూ విష్ణుప్రియ తెలిపింది. ఇకపోతే ఇలా యాంకర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇండస్ట్రీలో తమను రానివ్వడం లేదు అంటూ చేస్తున్న కామెంట్లు విని నిజంగానే ఇండస్ట్రీలో ఇంత జరుగుతోందా ? అసలు కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం లేదా? లేక ఈ సిండికేట్ నిజంగానే ఉందా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే సిండికేట్ ఉంటే దీనిని ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు ఎవరికి ఎలాంటి అవకాశాలు ఇస్తున్నారు అనే విషయంపై నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.