BigTV English
Advertisement

GudiGantalu Today episode: మీనా వంటకు ప్రశంసలు.. రోహిణి మాటతో ప్రభావతి షాక్.. సుశీల కోసం బాలు గిఫ్ట్..

GudiGantalu Today episode: మీనా వంటకు ప్రశంసలు.. రోహిణి మాటతో ప్రభావతి షాక్.. సుశీల కోసం బాలు గిఫ్ట్..

Gundeninda GudiGantalu Today episode November 3rd: నిన్నటి ఎపిసోడ్ లో..చేపల కవర్ మారిపోయిందని ప్రభావతి చెప్పగానే అక్కడ అందరూ షాక్ అయిపోతారు. ఇందాక మీనా నన్ను గుద్దినప్పుడు ఆ కవర్లు మారిపోయాయి.. చేపలు ఉన్న కవర్ ను మనోజ్ తీసుకెళ్లాడు. ఇవి నా బ్లౌజ్ పీసులకు సంబంధించినది అని ప్రభావతి అనగానే బాలుకి ఏదో అనుమానం కలుగుతుంది. ట్రైలర్ షాపు నాకు తెలుసు నేను వెళ్లి ఇచ్చేస్తానని బలవంతంగా ప్రభావతి దగ్గర ఉన్న కవర్ని లాక్కునే ప్రయత్నం చేస్తాడు.. ప్రభావతి మాత్రం నేను ఇవ్వను మనోజ్ వచ్చిన తర్వాతనే ఇస్తాను అని మొండిగా ఆ కవర్ని లాక్కుంటుంది.. ఇంతగా ఈ కవర్ ని ఇవ్వకుండా దాస్తున్నావు అంటే ఇందులో ఏదో ఉంది చూడాలి అని బాలు అంటాడు. ఏముంటాయి నీ మొహం ఉంటాయి ఇందులో నా బ్లౌజ్ పీసులు మాత్రమే ఉన్నాయని ప్రభావతి అంటుంది. ఇద్దరూ కలిసి కాసేపు వాదులాడుకుంటారు. మళ్లీ మనోజ్ రావడంతో వాడే తీసుకొని వెళ్తాడు అని ప్రభావతి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా చేసిన చేపల పులుసుని అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. చాలా బాగుంది ఇలాంటి చేపల పులుసుని నేను ఎప్పుడూ తినలేదు అని అందరూ పొగుడుతూ తింటారు. బాలు చాలా బాగా చేసిందని మీనా పై ప్రశంసలు కురిపిస్తాడు.. అందరూ కూడా చాలా సంతోషంగా అన్నం తింటూ ఉంటారు. అప్పుడే ఇంట్లో కూర్చున్న మనోజ్ చూసి ప్రభావతి వచ్చావా నీతో మాట్లాడాలి రా అని పక్కకు తీసుకొని వెళుతుంది. డబ్బులు తీసుకొచ్చావా అంతా బాగానే జరిగింది కదా.. ఇదే నా సమస్య ఉందా అని ప్రభావతి అడుగుతుంది ఏమీ లేదమ్మా ప్రస్తుతానికైతే నేను బయటపడినట్టే అని మనోజ్ అంటాడు. మీనా ఏదో జరుగుతుంది తల్లి కొడుకులు ఏదో చేస్తున్నారు అని అంటుంది.

ప్రభావతి వస్తే మీనా కూర్చోండి అని అంటుంది. ప్రభావతికి అన్నం వడ్డించి కూర వడ్డిస్తే ఇంకొంచెం వేస్తే నీ సొమ్మేమైనా పోతుందా అని అడక్కని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి అని ఆ కూర అని అక్కడ పెడుతుంది. నువ్వు వెళ్లి ఈరోజు రోహిణిని పిలుచుకు రారా అని మనోజ్ కి చెప్తుంది. మనోజ్ రోహిణి ని తీసుకురాడానికి పైకి వెళ్ళగానే రోహిణి చాలా సంతోషంగా మనోజ్ లక్షల సంపాదిస్తున్నాడని మురిసిపోతూ ఉంటుంది. అసలు నమ్మలేకున్నా మనోజ్ నువ్వు నిజంగానే అంత లాభాన్ని సంపాదించావని అడుగుతుంది. లక్ష రూపాయలు ఇంట్లో వాళ్ళందరికీ చూపించి ముఖ్యంగా బాలుకు చూపించి నువ్వేంటో నిరూపించాలి అని రోహిణి కిందకు తీసుకొని వస్తుంది..


మనోజ్ ని వెధవ పార్కులో పడుకునేవాడు ఇలా చాలా మాటలు అన్నారు.. కానీ మనోజ్ ఇవాళ నాలుగు లక్షల అమ్మేసి ఒక లక్ష ని ఇంటికి తీసుకొచ్చాడు. నేను ఇంకా షాప్ ని కూడా మింగేసాడు ఏమో అనుకున్నామని బాలు అంటాడు. వాడికి మింగల్సిన అవసరం ఏమీ లేదు అని ప్రభావతి అంటుంది. అత్తయ్య మీరు ఇందులో స్లీపింగ్ పార్ట్నర్ కదా.. మీకు ఇదిగోండి ఈ డబ్బులు అని రోహిణి అంటుంది. స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఏంటి నిద్రపోతూ ఉంటదా అని బాలు అంటాడు. అయినా వీళ్ళందరూ కుళ్ళు కుంటున్నారు మా ఆయన సంపాదిస్తున్నాడని..

40 లక్షలు ఇలా నేనే సంపాదిస్తే ఖచ్చితంగా తీసుకొని వస్తాడు నాన్న డబ్బులు నాన్నకిస్తాడు అని బాలు అంటాడు. త్వరలోనే ఆ డబ్బులు కూడా సంపాదించి ఇచ్చేస్తాడులే అని రోహిణి అంటుంది. ఇక ప్రభావతి వీళ్ళందరూ నీకు దిష్టి పెడుతున్నారు పక్కకురా దిష్టి తీస్తాను అని అంటుంది. డబ్బులు ఏంట్రా అందులో తీసుకొచ్చినవే కదా రేపు ఎలా కడతావు ఇప్పుడు రోహిణి ఎందుకు ఇంత చేస్తుంది అని అంటుంది.. బాలు కి నోరు మూయించాలి అమ్మ నాకేం సంబంధం లేదు అని మనోజ్ అంటాడు.

ఉదయం లేవగానే ప్రభావతి ఏమైనా కాఫీ ఇవ్వలేదు ఏంటి అని అరుస్తుంది.. నాకు కాఫీ ఇచ్చే టైం అయింది కదా నువ్వు ఎందుకు ఇంకా ఇవ్వలేదు అని నేను ఆపై సీరియస్ అవుతుంది ప్రభావతి. ఇంట్లో అందరికీ ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి పిలిచి ఇవ్వాలంటే కష్టం. అందరిని ఒకేసారి పిలిచి ఇవ్వాలి అని ప్రభావతి అంటుంది. అందని ఒకేసారి పిలవాలి అంతే కదా నేను పిలుస్తాను అని బాలు అంటాడు. అక్కడున్న విజిల్ తీసుకొని వచ్చి ఊదుతాడు. అందరూ ఏంటి పొద్దు పొద్దున్నే ఈ గోల అని అంటారు.. నాన్న అందరికీ కాఫీ ని పేరుపేరునా పిలిచి ఇవ్వాలని అమ్మనింది. అది కష్టం కదా అందుకే విజిల్ ఊది అందరికీ కాఫీకి పిలుస్తున్నాను మీనా రేపటి నుంచి ఇదే నువ్వు ఫాలో అవ్వు అని అంటాడు బాలు..

Also Read: బిగ్ బాస్ నుంచి మాధురి అవుట్.. 22రోజుల్లో ఎంత సంపాదించిందంటే..?

సత్యం కు సుశీలమ్మ ఫోన్ చేస్తుంది. 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ అని సత్యం అంటాడు. మీరందరూ ఉగాది కొచ్చారు ఆ తర్వాత రాలేదు కదా నా పుట్టిన రోజుకి అందరూ ఇక్కడికి రావాలని సుశీల అడుగుతుంది.. కానీ సత్యం మాత్రం ఏమి మాట్లాడుకున్నా ఉంటారు అందరూ నాకు కుదరదు అని సమాధానం చెబుతారు. అందరికీ కుదరదు కదా మీరే ఇక్కడికి రండి అమ్మమ్మ అని నేను అంటుంది. నేను రావడం మా కోడలికి ఇష్టం లేదనుకుంటా అని అనగానే అయ్యో అత్తయ్య ఇది మీ కొడుకులు మీరు రావాలి అని ప్రభావతి అంటుంది. షీలా నీ పుట్టినరోజు నీకు గ్రాండ్గా చేస్తామని బాలు అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Telugu TV Anchors: నిజంగానే బుల్లితెర యాంకర్స్ కి అన్యాయం జరుగుతోందా.. వీరిని తొక్కేస్తోందెవరు?

Gundeninda Gudigantalu Mounika : అక్కడేమో అలా.. ఇక్కడేమో ఇలా.. అందాలతో హీటేక్కిస్తుంది మావా..

Illu Illalu Pillalu Today Episode: నర్మద కాళ్ళు పట్టుకున్న సాగర్.. శ్రీవల్లి ప్రేమలో చందు.. ధీరజ్ తో ప్రేమ ఛాలెంజ్..

Nindu Noorella Saavasam Serial Today November 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  యమలోకంలో ఆరును చూసి అనుమానించిన నారదుడు

Intinti Ramayanam Today Episode: మీనాక్షికి యాక్సిడెంట్.. అవనిని అవమానించిన పల్లవి.. రాజేశ్వరికి నిజం తెలిసిపోతుందా..?

Brahmamudi Serial Today November 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీకి చుక్కలు చూపిస్తున్న రాజ్‌, కావ్య

Tv Serials : డీలా పడ్డ కార్తీక దీపం.. టాప్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు..ఈ వారం రేటింట్స్..?

Big Stories

×