E-Paper
Advertisement

దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయం చేయండి.. జేసీ వర్గానికి పెద్దారెడ్డి సవాల్!

దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయం చేయండి.. జేసీ వర్గానికి పెద్దారెడ్డి సవాల్!
Advertisement

Ketireddy Peddareddy:  తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వెైఎస్సార్‌సీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి స్థానిక పోలీసుల తీరుపై, ప్రత్యర్థి జేసీ వర్గీయులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ రాజకీయాలు చేయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి తప్ప, పోలీసులు, గంజాయి బ్యాచ్‌లను అడ్డుపెట్టుకుని హింసాత్మక రాజకీయాలు చేయడం ఏంటి..?’ అని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

సొంత ఊరిలో నామినేషన్ వేయకుండా హౌస్ అరెస్ట్..

Advertisement

తాడిపత్రిలో జరిగిన పరిణామాలపై కేతిరెడ్డి మాట్లాడుతూ.. తనను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసి,  తన స్వగ్రామమైన తిమ్మంపల్లిలో ఎస్సార్‌సీపీ అభ్యర్థితో నామినేషన్ కూడా వేయించకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తాను తిమ్మంపల్లికి వెళ్లిన సమయంలో తాడిపత్రిలోని తన ఇంటిపై జేసీ వర్గీయులు  రాళ్ల దాడికి తెగబడ్డారని, అంతేకాకుండా మరో నలుగురు వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై దాడులు చేసి దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు.

పోలీసు వ్యవస్థపై సంచలన ఆరోపణలు..

Advertisement

జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై తాడిపత్రి పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని కేతిరెడ్డి ప్రశ్నించారు. ‘ జేసీ వర్గీయులపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు..? పైగా పోలీసు కానిస్టేబుళ్ల ద్వారా నాపైనే అబద్ధపు ఫిర్యాదులు చేయించి కేసులు పెడుతున్నారు. బాధితులు వెళ్లి ఎంత మెుత్తుకున్నా జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదు. తాడిపత్రి పోలీసులు చేసి జేసీ వర్గానికి పూర్తిగా తొత్తులుగావ వ్యవహిరస్తుండటం నిజంగా బాధాకరం’ అని ఆవేధన వ్యక్తం చేశారు.

పోలీసులకే బ్లాక్ మెయిల్ బెదిరింపులు..!

అనంతపురం జిల్లా పోలీసులను జేసీ ప్రభాకర్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. అందుకే ఆయన పదే పదే పోలీసు స్టేషన్ల వద్ద ధర్నాలు చేస్తూ.. అధికారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వ్యాఖ్యానించారు శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఒక  వర్గానికి కొమ్ముకాయడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని ఆయన స్పస్టం చేశారు.

Also Read: హోసూరులో దారుణం.. ప్రియురాలి గొంతు కోసి .. ఆపై లారీ కింద పడి ప్రియుడి సూసైడ్!

Tags

Related News

‘వాళ్ళు గడ్డి తిన్నారని.. మీరూ అదే తింటారా’? కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్!

నేతలకు సీఎం చంద్రబాబు క్లారిటీ.. వారికి నామినేటెడ్ పోస్టులు, వీడియో కాన్ఫరెన్సులో కీలక వ్యాఖ్యలు

ప్రకాశం జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి..

రజినీ పేటలో సీన్ రివర్స్.. ప్లేట్ ఫిరాయించిన వైసీపీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థి, టీడీపీలో జాయిన్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. బద్దలైన వైసీపీ కంచుకోటలు, కూటమి ఖాతాల్లో 17 మున్సిపాలిటీలు

వాయువేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, తీరం దాటే సమయంలో

కడప ఎన్నికల ప్రచారంలో ఘోరం.. వైసీపీ మాజీ కార్పొరేటర్ పై కత్తితో దాడి!

Big Stories

Advertisement
×