Fake Doctor Scam: ఇంటర్ మాత్రమే చదివిన వ్యక్తి.. ఏకంగా 30 ఏళ్లపాటు డాక్టర్ గా చలామణి అయిన ఘటన షాక్ కు గురిచేస్తోంది. ఓ అస్పత్రిలో అటెండర్ గా చేసిన అనుభవంతో ఓ వ్యక్తి డయాబెటిస్ నిపుణుడిగా అవతారమెత్తాడు. అంతడితో ఆగకుండా.. ట్రస్టులు, ఎన్జీవోల పేరుతో ఏకంగా రూ.188 కోట్ల కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను, ప్రజా విరాళాలను కొల్లగొట్టాడు. ముంబై క్రైమ్ బ్రాంచ్ తమ ఛార్జి షీట్ లో పేర్కొన్న విషయాలు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
బీహార్‌లోని ఓ ఆస్పత్రిలో హెల్పర్‌గా పనిచేసిన ధర్మేంద్రకుమార్ సింగ్ అనే వ్యక్తి.. ఈ ఘరానా మోసానికి తెరలేపాడు. కేవలం 12వ తరగతి వరకే చదివిన అతను.. కొన్నేళ్ల కిందట ముంబై వచ్చి తనను తాను పెద్ద డాక్టర్‌గా ప్రచారం చేసుకున్నాడు. ‘ఆర్‌కే హెచ్‌ఐవీ ఎయిడ్స్ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్’, ‘డాక్టర్ 365 హెల్త్ సర్వీసెస్’ పేరుతో సంస్థలను ఏర్పాటు చేిస.. బడా కంపెనీల నుంచి సీఎస్‌ఆర్ గ్రాంట్లు, ప్రజల నుంచి విరాళాలు సేకరించాడు. ఆ సొమ్మును తన బంధువులు, ఉద్యోగాలు చేసే సిబ్బంది, ట్రస్టీల పేరిట ఉన్న సుమారు 30 బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించినట్లు క్రైమ్ బ్రాంచ్ విచారణలో తేలింది.
కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ‘సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్’ (SECL) ఇచ్చిన ప్రాజెక్టు విచారణలో ఈ కుంభకోణం బయటపడింది. బిలాస్‌పూర్‌లో 50,000 మందికి క్షయ (టీబీ) పరీక్షలు నిర్వహించేందుకు రూ. 3.82 కోట్లతో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా మొదటి విడతగా రూ. 38.25 లక్షల నిధులు కూడా విడుదలయ్యాయి. అయితే లబ్ధిదారుల సమాచారాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. 543 మందికి గాను 520 మంది తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తేలింది. నకిలీ లబ్ధిదారుల డేటాను సృష్టించి సొమ్ము కాజేసినట్లు స్పష్టమైంది. అంతేకాకుండా మరొక సీఎస్‌ఆర్ ప్రాజెక్ట్ కింద వచ్చిన రూ. 23.17 లక్షల నిధుల నుంచి ఏకంగా రూ. 22.23 లక్షలను వ్యక్తిగత వాహనాల కొనుగోలుకే వాడేసినట్లు వెల్లడైంది.
Also Read: పాకిస్తాన్ ప్లేయర్లు 25 వేల డాలర్లు ఇవ్వాల్సిందే…గుంట నక్క నఖ్వీ దిక్కుమాలిన కండీషన్
గత జూలై నెలలో ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు ధర్మేంద్రకుమార్ సింగ్‌కు చెందిన ఆస్పత్రులు, కార్యాలయాలపై దాడులు నిర్వహించి 220కి పైగా విలువైన ఆధారాలను జప్తు చేశారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున మెడికల్ పరికరాలు, కంప్యూటర్లతో పాటు గడువు ముగిసిన (ఎక్స్‌పైరీ) మందులు, ప్రభుత్వం ఉచిత పంపిణీకి ఉద్దేశించిన మందుల సీసాలను స్వాధీనం చేసుకున్నారు. చారిటబుల్ ట్రస్ట్ నిధుల నుంచి తన ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించినట్లు పోలీసులు కూడా గుర్తించారు. ప్రస్తుతం ఈ ఖాతాల నుంచి జరిగిన ఆర్థిక లావాదేవీలపై లోతైన విచారణ కొనసాగుతోంది.
Also Read: కేటీఆర్.. ఆ సుద్దపూస మాటలు బంద్ చేయ్! మీ తప్పులు ప్రజలకు తెలుసు: ఎంపీ చామల