Mirai: ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Viswaprasad) నిర్మించిన చిత్రం ‘మిరాయ్’. కృతి ప్రసాద్ సహ నిర్మాతగా పనిచేస్తున్నారు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) తొలి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అటు అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టి.. ‘జాంబిరెడ్డి’ సినిమాతో హీరోగా మారి, ‘హనుమాన్’ సినిమాతో సూపర్ హీరోగా పేరు సొంతం చేసుకున్న తేజ సజ్జా (Teja sajja) ఈ సినిమాలో సూపర్ యోధ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పురాణాల ఆధారంగా సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా లో మంచు మనోజ్ (Manchu Manoj), శ్రియా శరన్ (Shriya Saran) కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి మంచు మనోజ్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇందులో మెయిన్ విలన్ మనోజ్ కాదట. రానా(Rana daggubati) అని తెలిసి.. అసలు ఊహించలేదు అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇవ్వనున్న రానా..
అసలు విషయంలోకి వెళ్తే.. సినిమా మొదటి భాగం మొత్తం.. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈయన మెయిన్ విలన్ కాదు అని.. ఈ సినిమా క్లైమాక్స్ లో ఈ విషయం రివీల్ చేయబోతున్నారట. ఇందులో మెయిన్ విలన్ రానా అని, ఈయన ఈ సినిమా క్లైమాక్స్ లో కనిపిస్తారని సమాచారం. ముఖ్యంగా ఇందులో రానా పాత్ర పార్ట్ 2కి రూట్ ఇచ్చేలా ఉంటుందని సమాచారం. ఏది ఏమైనా రానా ఈ సినిమాలో అందులోనూ మెయిన్ విలన్ గా నటించడమే కాకుండా పూర్తిగా పార్ట్ 2 కి రూటు ఇచ్చేలా ఉండే పాత్రలో నటించబోతున్నారని తెలిసి అభిమానులు సైతం ఆ పాత్ర కోసం చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
సినిమా బడ్జెట్ , బిజినెస్ డీటెయిల్స్..
సుమారుగా ఈ సినిమా కోసం రూ. 60 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.. ముఖ్యంగా ఈ చిత్రానికి బిజినెస్ కూడా బాగా జరిగినట్లు తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ హక్కులు అనగా ఓటీటీ , శాటిలైట్ హక్కులు మొత్తం కలిపి 45 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి . ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రలో రూ.8కోట్లు , నైజాంలో రూ.7కోట్లు, సీడెడ్ లో 3 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. కర్ణాటకలో రూ .2కోట్లు, తమిళనాడులో రూ.2.5 కోట్లు, కేరళలో రూ.50 లక్షలు, హిందీలో రూ.10 కోట్ల రూపాయల మేరా వాల్యూ కట్టినట్లు సమాచారం.
also read:Salman Khan: ఏకైక ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన సల్మాన్ ఖాన్ మూవీ..ఏదంటే?