Prithvi Shaw : ముంబై లోని అంధేరీ శివారు లోని ఒక క్లబ్‌లో తనపై దాడి చేసి, అవమానించినందుకు భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) పై పోలీసు కేసు నమోదు చేయాలని కోరుతూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ ముంబై కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు పై ఐపీసీ సెక్షన్లు 354, 509, 324 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పృథ్విషా (Prithvi Shaw), అతని స్నేహితుడు ఆశిష్ యాదవ్ పై అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. ఇన్ ఫ్లుయెన్సర్ సప్నా గిల్ ని వేధించిన కేసులో టీమిండియా క్రికెటర్ పృథ్వి షా(Prithvi Shaw) కి ముంబై కోర్టు (Mumbai Court) రూ.100 జరిమానా విధించింది. ఫిబ్రవరి 15, 2023 న అంధేరీలోని ఓ పబ్ లో పృథ్వీషా (Prithvi Shaw) తన పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సప్నాగిల్ (Sapna Gill) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read : Anaya-Chahal : చాహల్ ఇంత కామాంధుడా…అనయ బంగర్ ప్రైవేట్ ఫోటోలు తీసి!
పోలీసులు FIR నమోదు చేయకపోవడంతో ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కి కౌంటర్ దాఖలు చేయాలని పృథ్విషా (Prithvi Shaw) కి పలుమార్లు అవకాశం ఇచ్చినా స్పందించకపోవడంతో రూ.100 ఫైన్ విధించింది కోర్టు. పృథ్విషా (Prithvi Shaw) గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ ఆడాడు. కానీ 2025 సీజన్ కి అతన్ని తీసుకోలేదు ఢిల్లీ క్యాపిటల్స్ . ఇటీవల ముంబై లోని ఓ హోటల్ కి వెళ్లిన పృథ్వీ షా (Prithvi Shaw) తో సెల్పీ దిగేందుకు సప్నా గిల్, ఆమె స్నేహితులు ప్రయత్నించారు. తొలుత ఓ సెల్ఫీ దిగేందుకు అనుమతించిన పృథ్వీషా.. ఆ తరువాత పదే పదే అడగడంతో నిరాకరించాడు. దీంతో హోటల్ నుంచి వెళ్లిన తరువాత క్రికెటర్ ను వెంబడించి వాగ్వాదానికి దిగారని.. తన స్నేహితుడి కారును ధ్వంసం చేశారని పృథ్వీషా ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సప్నా గిల్(Sapna Gill) సహా ఆమె స్నేహితులను అరెస్ట్ చేశారు. ఆ తరువాత బెయిల్ పై బయటికి వచ్చిన సప్నా గిల్ పృథ్వీషా పై కేసు పెట్టింది.
మరోవైపు పృథ్వీ షా క్రికెట్ కెరీర్ ని పరిశీలించినట్టయితే.. వెస్టిండీస్ తో 2018లో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ తొలి మ్యాచ్ టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు పృథ్వీషా. 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ తరపున ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా పృథ్వీషా రికార్డు నెలకొల్పాడు. పృథ్వీషా 18 ఏళ్ల 329 రోజుల వయస్సులో టెస్టుల్లో ఆరంగేట్రం చేయడమే కాకుండా..సెంచరీతో మెరిశాడు. అండర్-19 వరల్డ్ కప్ ( U-19 World Cup) లో పృథ్వీషా (Prithvi Shaw) కెప్టెన్సీలో శుబ్ మన్ గిల్, అర్ష్ దీప్ సింగ్, ఇషాన్ కిషన్ వంటి క్రికెటర్లు ఆడారు. కానీ ఇప్పుడు వాళ్లు టీమిండియాలో స్థానం దక్కించుకొని టాప్ పొజిషన్ లో కొనసాగుతుంటే.. ఇతను మాత్రం చాలా దిగజారిపోవడం గమనార్హం. ప్రస్తుతం కోర్టు రూ.100 జరిమానా విధించడంతో వార్తల్లో నిలవడం విశేషం.