Film industry : సాధారణంగా సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి . ముఖ్యంగా షూటింగ్ సెట్లో జరిగే ప్రమాదాలు ఏకంగా నటీనటుల ప్రాణాలను కూడా తీసిన విషయం తెలిసిందే. ఇంకొంతమంది దేవుడి దయతో ఆరోగ్యంగా బయటపడితే.. మరికొంతమంది జీవితాంతం ఆ నరకం అనుభవించాల్సి ఉంటుంది.. ఇదిలా ఉండగా ఇప్పుడు సడన్‌గా ఒక హీరోపై ఎద్దు దాడి చేయడం సంచలనగా మారింది.
సాధారణంగా బయట జనావాసాలలో ఇలా ఎద్దులు జనాలపై దాడి చేసిన ఘటనలు మనం చూసే ఉన్నాం. కానీ ఇప్పుడు ఏకంగా ఒక హీరో పై ఎద్దు దాడి చేయడం వైరల్ గా మారింది.. సాధారణంగా సెలబ్రిటీలు పబ్లిక్ లోకి రారు.. అలాంటప్పుడు ఈ ఘటన ఎలా జరిగింది? అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. ఇదంతా ఒక సినిమా షూటింగ్ సెట్ లో జరిగినట్లు సమాచారం.
హీరో పై దాడి చేసిన ఎద్దు..
అసలు విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ హీరో అశోక్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘వడ మంజువిరట్టు’.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జల్లికట్టు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో అశోక్ పై ఒక్కసారిగా ఎద్దు దాడి చేసింది. దీంతో హీరో పక్కటెముకల భాగంలో చిన్న గాయమైంది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లిన చిత్ర బృందం.. అక్కడ చికిత్స చేయించారు.. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చి మళ్ళీ షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం అయితే ఈ ఎద్దు దాడిలో హీరోకి పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూగజీవులతో సినిమాలు చేయొద్దని ఎంత చెప్పినా వినరు కదా.. కనీసం ఇప్పటికైనా జాగ్రత్తగా షూటింగ్ చేయండి అంటూ సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వడ మంజువిరట్టు సినిమా విశేషాలు..
వడ మంజువిరట్టు సినిమా విషయానికి వస్తే.. అసలు విషయంలోకి వెళ్తే గ్రామీణ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. తమిళనాడులో జల్లికట్టు ఎలా అయితే నిర్వహిస్తారో.. ఈ వడ ముంజవిరట్టు కూడా అలాంటిదే. ఇందులో యువకులు ఎద్దులను మచ్చిక చేసుకుని ఆడే ఆటగా దీనిని పరిగణిస్తారు. ఇకపోతే ఇప్పుడు ఇదే టైటిల్ తో కోలీవుడ్లో సినిమా రాబోతోంది. గ్రామీణ నేల వాసన, సంస్కృతిక ప్రేమ కథల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.. సంగిలి సిపిఏ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండగా.. అలగర్ పిక్చర్స్ బ్యానర్ పై పుదుఖై ఏ పళనిస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఎద్దు దాడి పై స్పందించిన హీరో..
ఈ సినిమాలో హీరోగా అశోక్ నటిస్తున్నారు. ఈయన ఎదురుగా వచ్చే ఎద్దుతో నటించే సన్నివేశాన్ని దిండిగల్ ప్రాంతంలో అంజుక్కులీపట్టిలో చిత్రీకరించాల్సి ఉంది.. అశోక్ ఎద్దు దగ్గరకు వెళ్లి దానిని మచ్చిక చేసుకొనే ప్రయత్నం చేయగా.. ఆ ఎద్దు అశోక్ ను తన్ని దూరంగా విసిరేసింది. ఫలితంగా కడుపు నుండి ఛాతి వరకు గాయాలయ్యాయి. ఇకపోతే ఈ విషయంపై అశోక్ మాట్లాడుతూ..” ఈ గాయం స్వల్పంగా తగిలింది . ఒకవేళ కాస్త లోతుగా తగిలి ఉంటే ఊపిరితిత్తులు చీలిపోయేవి. ఈ ఎద్దు పేరు పటాన్. ఎప్పుడూ నాతో సరదాగా ఉంటుంది. కానీ ఆరోజు ఏమైందో తెలియదు.. మనుషులు ఎలా అయితే కోపం వస్తే ప్రవర్తిస్తారో ఇక మూగ జంతువులు కూడా అలాగే ప్రవర్తిస్తాయి” అంటూ తెలిపారు.
అశోక్ నటించిన చిత్రాలు..
అశోక్ విషయానికి వస్తే.. మురుగ, గ్యాంగ్స్ ఆఫ్ మద్రాస్, ఆర్ యు ఓకే బేబీ, బెస్తీ, మాయాపుత్తకం, లారా వంటి చిత్రాలతో పాటు 25 కు పైగా చిత్రాలలో నటించి పేరు సొంతం చేసుకున్నారు.
Bull attack on actor #AshokKumar during the shoot of #VadaManjuVirattu 🐂🔥
Despite a Biggest injury, he was given immediate medical care and quickly bounced back to continue shooting with full spirit. 💪✨@ashokactor@PROSakthiSaran pic.twitter.com/q61aGdRI8G
— Sundar Bala Actor (@PROSundarbala) September 9, 2025