Mega Family:ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కోరిక నెరవేరింది. మెగా కుటుంబంలో అందరూ అమ్మాయిలే ఉన్నారు.. కొడుకు కావాలి అని.. తన కొడుకు రామ్ చరణ్ (Ram Charan) ను ఆశగా అడిగిన చిరంజీవికి.. ఆ కోరికను నెరవేర్చారు మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) . అసలు విషయంలోకి వెళితే.. టాలీవుడ్ స్టార్ కపుల్ గా పేరు సొంతం చేసుకున్న వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇప్పుడు తల్లిదండ్రులయ్యారు. కాసేపటి క్రితం లావణ్య మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా ఫాన్స్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు మెగా వారసుడు వచ్చాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి కూడా ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ సెట్ నుంచి ఆసుపత్రికి వెళ్లి లావణ్య – వరుణ్ దంపతులకు స్పెషల్ విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
2017లో మిస్టర్ అనే సినిమాతో తొలిసారి సెట్ లో కలుసుకుంది ఈ జంట. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలో కూడా నటించారు. ఇక ఈ సినిమాల సమయంలోనే వీరి మధ్య పరిచయం స్నేహంగా మారి.. ఆ తర్వాత ప్రేమగా మారిందట. కొంతకాలం రహస్యంగా డేటింగ్ చేసుకున్న వీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంతేకాదు లావణ్యను కలవడానికి వరుణ్ తేజ్ రహస్యంగా అప్పుడప్పుడు బెంగళూరు కూడా వెళ్లేవారట. ఇక పెళ్లి చేసుకుంటారని ఎన్నోసార్లు వార్తలు వచ్చినా ఎవరు స్పందించలేదు. కానీ ఎట్టకేలకు సింపుల్ గా నిశ్చితార్థం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈ జంట.. 2023 నవంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించిన లావణ్య – వరుణ్ తేజ్ దంపతులు ఇప్పుడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.
వరుణ్ తేజ్ సినిమాలు..
చివరిగా మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమాతో డిజాస్టర్ ను చవిచూశారు. ఇప్పుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో #VT 15 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. హారర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. ఇక ఇందులో రితిక నాయక్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా..UV క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం.
లావణ్య త్రిపాఠి సినిమాలు..
వివాహం తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈమె.. హ్యాపీ బర్త్డే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు సతీ లీలావతి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాతో లావణ్య ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
also read:Manchu Lakshmi: మంచు లక్ష్మిని పట్టుకుని ఎంత మాట అనేశాడు.. అక్కడే ఇచ్చే పడేసిందిగా!
?utm_source=ig_web_copy_link