Manchu Lakshmi:టాలీవుడ్ సీనియర్ హీరోగా పేరు సొంతం చేసుకున్న మంచు మోహన్ బాబు (Mohan Babu)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈయన వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మీ ప్రసన్న(Manchu Lakshmi Prasanna) మంచు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె కొన్ని చిత్రాలలో నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో దూసుకుపోతోంది. మొదట ‘ అనగనగా ఓ ధీరుడు ‘ అనే సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించింది.ఇదిలా ఉండగా తాజాగా మంచు లక్ష్మికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల దుబాయ్ వేదికగా సైమా అవార్డ్స్ 2025 కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన మంచు లక్ష్మి వేదిక వద్దకు వెళుతుండగా ఆమెతో సెల్ఫీలు దిగడానికి అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు దీంతో అభిమానులతో సెల్ఫీ తీసుకోబోతుండగా.. ఒక అభిమాని వెనుక నుంచి “లచ్చక్క.. నీ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నావ్? అంటూ అడిగాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంచు లక్ష్మి.. “ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడరా? మీకు అసలు సెన్స్ లేదు. రాస్కెల్స్” అంటూ ఒక్కసారిగా మండిపడింది. దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
also read:Mirai: మిరాయ్ మూవీలో అసలు విలన్ మనోజ్ కాదు… రానాతో బిగ్ ట్విస్ట్ ?
నెటిజెన్స్ భిన్నాభిప్రాయాలు..
ఇది చూసిన కొంతమంది.. “ఎంత ధైర్యం రా.. నీ గుండె 11 కాలాల పాటు చల్లగా ఉండాలి” అనికామెంట్లు చేస్తే .. మరి కొంతమంది “సెలబ్రిటీలను పబ్లిక్ లో ఇలా అవమానించడం కరెక్ట్ కాదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది “మీ నాన్న టీవీ మైకుతో కొట్టారు నువ్వు సెల్ ఫోన్ తో కొడతావనే భయంతో అతడు నీ ముందుకు రాలేదు” అంటూ కామెంట్ చేశారు. అంతటితో ఆగకుండా..” ఫైర్ బ్రాండ్ కి పుట్టిన కూతురు ఫైర్ బ్రాండే అవుతుంది” అంటూ ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఏది ఏమైనా మంచు లక్ష్మి కి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దక్ష మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మంచు లక్ష్మి..
మంచు లక్ష్మి సినిమాల విషయానికొస్తే.. దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ తెరపై కనిపించబోతోంది. దక్ష (ది డెడ్లీ కాన్సిఫరసీ) అనే చిత్రంలో పవర్ఫుల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో ఈమె తండ్రి మోహన్ బాబు కూడా నటిస్తున్నారు. అంతేకాదు సొంత బ్యానర్ ‘లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్’ బ్యానర్ ను దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి అదే బ్యానర్ పై సినిమాను నిర్మిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇటీవల ఈ సినిమా నుండి టీజర్ విడుదల చేయగా.. దీనికి అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ సినిమాలో మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న నటించడమే కాకుండా నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తున్నారు. వంశీకృష్ణ మల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 19వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది.
?utm_source=ig_web_copy_link