Nethannaku Bharosa Scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడంతో, కొన్ని పథకాలపై ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో మరో పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ పథకం లబ్దిదారుల్లో రూ.25వేల చొప్పున ఆర్థిక సాయం లభించనుంది. ఇంతకీ ఆ పథకం ఏంటి? ఎవరికి లబ్ది చేకూరనుంది.
ఏపీ ప్రభుత్వం మరొక పథకానికి శ్రీకారం-చేనేత కార్మికులకు ఊహించని శుభవార్త చెప్పనుంది కూటమి సర్కార్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న నేతన్నకు భరోసా పథకాన్ని అమలు చేయాలని ఆలోచన చేస్తోంది. ఈ పథకం కింద చేనేత కార్మికులు ఒక్కొక్కరికి రూ.25 వేలు సాయం చేయనుంది ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో చేనేతలకు రూ. 24 వేలు ఇచ్చేది. అయితే కూటమి ప్రభుత్వం మరో రూ. 1000 కలిపి రూ.25 వేలు ఇవ్వాలని భావిస్తోంది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించింది. ఈ పథకానికి సంబంధించిన త్వరలో విధివిధానాలను విడుదల చేయనుంది ప్రభుత్వం.
చేనేత కార్మికులకు శుభవార్త-ఏపీవ్యాప్తంగా చేనేత కార్మికులు దాదాపు 54వేలమంది అర్హులు ఉంటారని ఓ అంచనా. సొంత మగ్గం ఉండి చేనేత కార్మికులకు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కుటుంబంలో ఒకరికి ఆర్థిక సాయం కింద ఏడాదికి రూ.25 వేలు ఇవ్వనుంది. చేనేత అనుబంధ రంగాలకు చెందినవారికి గతంలో ఎలాంటి ఆర్థిక సాయం ఇవ్వలేదు. తాజాగా అనుబంధ రంగాల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. చేనేత రంగానికి అనుబంధంగా కొన్ని ఉన్నాయి. వాటిలో రాట్నం వడకడం, రంగులు అద్దడం ఉన్నాయి. అందులోని వారికి పథకంలోకి తీసుకురావాలని ఆలోచన చేస్తోంది.
ఒకొక్కరి అకౌంట్లలో పాతికవేలు? ఈ రంగానికి సంబంధించి మరో 10 వేల మంది ఉంటారని ఓ లెక్క. ఈ మేరకు అధికారులు అంతా రెడీ చేసి ఫైలును ప్రభుత్వానికి పంపించారు. దీనిపై ఈ నెలాఖరులోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దీనిపై ఈ నెలాఖరులోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే చేనేతలకు ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వం. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందజేస్తోంది. ఈ పథకం కింద 93 వేల మంది కుటుంబాలు, 11,488మంది పవర్ లూమ్ కుటుంబాలున్నాయి.
ALSO READ: రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. అక్కడ వర్షాలు, ఇక్కడ వడగాడ్పులు
ఇందుకోసం ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ పథకం వల్ల చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.8,640, పవర్ లూమ్ కుటుంబానికి రూ.21,600 ఆదా అవుతోంది. ఇదిలాఉండగా చేనేతలకు పింఛన్‌ను రూ.4 వేలకు పెంచింది. ఆధునిక యంత్రాల కొనుగోలుపై 90 శాతం రాయితీ ఇస్తోంది. ముడిసరకులపై 15 శాతం రాయితీ ఇస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే చేనేతలకు ఏపీలో స్వర్ణయుగంగా కొందరు నేతలు చెబుతున్నారు.