E-Paper
Advertisement

కాణిపాకం హుండీలో కాసుల వర్షం.. 22 రోజుల్లో పోటెత్తిన విరాళాలు.. లెక్కలు చూస్తే షాకే!

కాణిపాకం హుండీలో కాసుల వర్షం.. 22 రోజుల్లో పోటెత్తిన విరాళాలు.. లెక్కలు చూస్తే షాకే!
Advertisement

Kanipakam Hundi: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. స్వామివారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తులు తమ మొక్కులను పెద్ద ఎత్తున సమర్పించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గత 22 రోజులకు గాను ఆలయ హుండీలను అధికారులు శాస్త్రోక్తంగా లెక్కించారు. విరాళాలు, కానుకల రూపంలో దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది.

హుండీ ఆదాయం ఎంతంటే?

గత 22 రోజులుగా భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా.. స్వామివారికి నగదు రూపంలో ఏకంగా రూ. 1,83,98,379 (ఒక కోటి 83 లక్షల 98 వేల 379 రూపాయలు) ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

బంగారం, వెండి కానుకలు

Advertisement

భక్తులు నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను సైతం కానుకల రూపంలో సమర్పించారు. 22 రోజుల వ్యవధిలో దేవస్థానానికి 49 గ్రాముల బంగారం, 640 గ్రాముల వెండిని కానుకల రూపంలో భక్తులు అందజేశారు.

గో సంరక్షణ, అన్నదాన విరాళాలు

ఆలయంలో సాగే సేవా కార్యక్రమాలకు కూడా భక్తులు తమ వంతు సాయాన్ని అందించారు. స్వామివారి నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ.2,20,830 లభించాయి. గోవుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన గో సంరక్షణ హుండీ ద్వారా రూ. 16,165 ఆదాయం సమకూరింది.

Advertisement

Also Read: ‘మహిళల ఆత్మగౌరవంతో ఆటలాడొద్దు’.. హైకోర్టు తీర్పులపై సుప్రీంకోర్టు సీరియస్!

విదేశీ భక్తుల కానుకల వెల్లువ

అటు విదేశాల నుంచి వచ్చే భక్తులు, ప్రవాస భారతీయులు కూడా స్వామివారికి పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని కానుకలుగా సమర్పించారు. ఈ లెక్కింపులో అత్యధికంగా అమెరికాన్ కరెన్సీ 2,373 డాలర్లు రాగా, యూఏఈ కి చెందిన 625 ధీరమ్స్, కెనడాకు చెందిన 65 డాలర్లు, సౌదీ అరేబియాకు చెందిన 60 రియల్స్ కానుకగా వచ్చాయి. వీటితో పాటు సింగపూర్ కి చెందిన 12 డాలర్లు, మలేషియాకు చెందిన 3 రింగిట్స్, అలాగే ఆస్ట్రేలియాకు చెందిన 5 డాలర్ల కరెన్సీని భక్తులు స్వామివారి హుండీలో వేశారు.

Also Read: సముద్రంలోకి అంత ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనక ఉన్న సైన్స్ ఇదే!

Related News

ఒక్క క్యూఆర్ కోడ్‌తో బిడ్డ ప్రాణాలు సురక్షితం.. ఏపీ పోలీసులు సూపర్ ఐడియా..?

వైఎస్ జగన్‌కి బిగ్ షాక్.. జనసేనలోకి వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతలు జంప్?

కృష్టా జిల్లా మున్సిపాలిటీల్లో షాకింగ్ న్యూస్.. మారిన రాజకీయ ముఖచిత్రం!

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పిన పవన్!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

వివేకానంద కేసు.. ఈడీ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి, విచారణ మరో అడుగు ముందుకెళ్లేనా?

‘మాపై కోపంతో ఆ పనులన్నీ ఆపేశారు’.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ!

Big Stories

Advertisement
×