E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి టెన్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి.. ప్రేమ సేఫ్..

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి టెన్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి.. ప్రేమ సేఫ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 16th: ప్రేమ క్లాసులో అందరూ తన గురించి మాట్లాడుకున్న మాటలు విని చాలా సంతోషంగా బయటికి వస్తుంది.. అయితే ధీరజ్ కి నేనంటే ఎంత ప్రేమ అని సంతోషంగా బయటికి వస్తున్న సందర్భంలో ఎస్సై ప్రేమకు ఫోన్ చేసి మీరు రూమ్ బుక్ చేసుకున్న టైం లోనే ఒక క్రైమ్ జరిగింది మిమ్మల్ని విచారించాలి ఒకసారి రండి అని చెప్పగానే ప్రేమ షాక్ అవుతుంది.. ధీరజ్ కి ఈ విషయం చెప్తుంది అయితే ప్రేమ నువ్వేమీ టెన్షన్ పడకు అక్కడ ఏమీ జరగదు జస్ట్ ఎంక్వయిరీ ని అని అంటాడు.. ఇక ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా ఎస్ఐ చెప్పినట్టు పోలీస్ స్టేషన్ కి వెళుతూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని నర్మదకు ఫోన్ చేసి చెప్పగానే షాక్ అవుతుంది.. ఒంటరిగా ఎందుకు వెళ్తున్నారు మేము వచ్చేవాళ్లం కదా అని నర్మదా అనగానే మీరు ఏమి భయపడకండి.. మేము జస్ట్ వెళ్లేసి వస్తాము అని ప్రేమ అంటుంది.. ఈ విషయాన్ని వెంటనే నర్మద వెళ్లి వేదవతికి చెప్తుంది.

వేధవతికి కొట్ట టెన్షన్..

ప్రేమ నర్మదకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్తుంది.. అయితే అక్కడ ఏదో జరుగుతుంది అత్తయ్యకి విషయం చెప్పాలి అని అనుకుంటుంది. జరిగిన విషయం గురించి చెప్పగానే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏం జరిగింది ఎందుకు మళ్లీ వాళ్ళు అక్కడికి వెళ్ళరు అని కంగారు పడిపోతూ ఉంటుంది. మనం కూడా అక్కడికి వెళ్తే ఈ కంగారు తగ్గుతుంది కదా అని వేదవతి ఎంత చెప్తున్నా సరే నర్మద మాత్రం మీరు టెన్షన్ పడకండి అత్తయ్య.. అక్కడ ఏం జరుగుతుందో ప్రేమ వాళ్ళు ఫోన్ చేసి చెప్తామన్నారు కదా ఆ తర్వాత మనం అక్కడికి వెళ్దాము అని అనగానే. వేదవతి భయపడిపోతుంది.. ఆ మోపిదేవి దగ్గర వాళ్ళిద్దరు పెళ్లి జరిగింది కదా మరి అక్కడ ఏదైనా జరిగితే మనం పెళ్లి చేసిన విషయం ఈయనకు తెలిస్తే నేను అబద్ధం చెప్పిన దానవుతాను.. మీ మావయ్య గారి మొహం తర్వాత చూడలేను అని వేదవతి కంగారు పడిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ టెన్షన్ పడిపోతూ మాట్లాడుతూ ఉండగా.. శ్రీవల్లి కూల్ గా ఆపిల్ తింటూ మిమ్మల్ని పరుగులు పెట్టిస్తాను గా శ్రీవల్లి అంటే మాట కాదు ఫైర్ అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటుంది..

తల్లి కోరికను కాదన్న భద్ర..

Advertisement

భద్ర సేన తన తల్లి 70వ పుట్టినరోజుని చాలా గ్రాండ్ గా జరపాలని అనుకుంటారు.. మన అమ్మకి గుర్తుండిపోయేలా ఈ పుట్టినరోజుని మనం చేయాలి అని అనుకుంటారు.. కానీ ఆమె మాత్రం కోడలు తెచ్చిన కాఫీని కూడా తాగకుండా బాధపడిపోతూ ఉంటుంది.. ఏంటి అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు ఏం జరిగింది అని రేవతి అడుగుతుంది.. ఇప్పుడు కాఫీ తాగకపోతే నేనేమైనా చచ్చిపోతానా అని మాట్లాడడంతో భద్రసేన ఇద్దరు కూడా షాక్ అవుతారు.. ఏంటమ్మా నీ 70వ పుట్టినరోజు నీకు గ్రాండ్గా చేయాలని మేము ఆలోచిస్తుంటే ఇలా భారంగా మాట్లాడుతున్నావేంటి ఏం జరిగిందమ్మా అని అడుగుతారు.. నా పుట్టిన రోజు తర్వాత నేను బతుకుతాను చచ్చిపోతానో తెలియదు.. అలాంటిది ఈ పుట్టినరోజునే గ్రాండ్ గా చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు. కానీ నా చిన్న కూతురుతో కలిసి చేసుకోవాలని నా కోరిక అనే చెప్తుంది.. నీ పుట్టినరోజు నాయన చేయడం ఆపేస్తాం కానీ ఆ పనోడ్ని మాత్రం మన ఇంటికి రానివ్వము అని భద్రత తెగేసి చెబుతుంది.

మోపిదేవికి వెళ్లిన ప్రేమ, ధీరజ్..

ప్రేమ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయితే ప్రేమ టెన్షన్ పడుతూ ఉండడం చూసిన ధీరజ్ ఏంటి నువ్వు అలా టెన్షన్ పడుతున్నావు అని అంటాడు.. లేదురా అక్కడ ఎస్ఐ గారు ఎందుకు రమ్మన్నారు నాకు అర్థం కావడం లేదు.. నాకు బాగా టెన్షన్ గా ఉంది రాణి ప్రేమ అంటూ ఉండగా ఏం కాదే ఏదో ఎంక్వయిరీ కోసం అన్నారు కదా నువ్వేం భయపడకు అని ధీరజ్ ప్రేమని ఓదారుస్తూ ఉంటాడు.. వీళ్లు వెళ్తూ ఉండగా వెనకాలే.. భాగ్యం ఆనందరావు కూడా ఫాలో అవుతూ వెళ్ళిపోతారు.. ఫాలో అవుతూ మన వెళ్తే అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది కదా.. ఇద్దరు కూడా చాలా తొందరగా వెళ్ళాలి అని అనుకుంటారు..

హమ్మయ్య.. ప్రేమ సేఫ్..

Advertisement

అక్కడికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్ లో పోలీసులు కాల్ చేసి ఇక్కడికి రమ్మన్నారు ఏంటండీ పరిస్థితిని ధీరజ్ కనుక్కుంటాడు.. అక్కడ ఏమీ లేదు ఏమి జరగలేదని రిసిపి చెప్పగానే మమ్మల్ని పోలీసులు ఫోన్ చేస్తే ఇక్కడికి రమ్మన్నారు అని ఆమెతో అంటారు ధీరజ్.. ఇక ఎస్ఐ మళ్ళీ ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్పగానే ప్రేమ వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఫాలో అవుతూ వచ్చిన ఆనందరావు, భాగ్యం ఇద్దరు కూడా.. ప్రేమ పెళ్లి ఎలా జరిగిందన్న విషయాలన్నీ తెలుసుకోవాలని అనుకుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఎస్సై తో మాట్లాడి మేము రాంగ్ గా మీకు ఫోన్ చేసాము వేరే వాళ్ళని ఎంక్వయిరీ చేయాల్సింది మిమ్మల్ని పిలిచాము క్షమించండి అని అంటాడు.. భాగ్యం వాళ్ళు ఏర్పాటు చేసిన ఎస్ఐ కావడంతో అతనికి అనుకున్న దాని కంటే ఎక్కువగానే పేమెంట్ ఇస్తుంది భాగ్యం..

శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..

శ్రీవల్లి చందుకోసమని బాక్స్ తీసుకుని రైస్ మిల్లుకు వెళుతుంది.. అక్కడ రైస్ మిల్ కి వెళ్ళగానే చందు నువ్వేంటి ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు.. అదేంటి బావా అలా అడుగుతున్నావు నీకోసం క్యారేజ్ కట్టుకొచ్చాను అని శ్రీవల్లి అంటుంది.. నీ దొంగ నాటకాలు దొంగ ప్రేమలు నాకు తెలియవు అని అనుకుంటున్నావా..? జన్మలో నేను నమ్మను అని చందు అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది.. ఏంటి నువ్వు ఇలా మళ్లీ ఇంకొకసారి తీసుకురావద్దు అని చందు వార్నింగ్ ఇస్తాడు. చందు కోసం తెచ్చిన బాక్స్ ని అక్కడ ఉన్న పని వాళ్ళకి ఇవ్వడంతో శ్రీవల్లి బాధపడుతుంది.. ఇక ప్రేమ ధీరజులు తాము పెళ్లి చేసుకున్నారు లోకి వెళ్లి ఒకసారి చూడాలి అని అనుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: బాబు కడియాలను కొట్టేసిన పల్లవి.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..పల్లవి పై అనుమానం..

Related News

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి మనోహరి గురించి సరస్వతి నిజం చెప్తుందా..?  

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×