Kushboo Sundar: కోలీవుడ్ సీనియర్ బ్యూటీ ఖుష్బూ సుందర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జబర్దస్త్ కు జడ్జిగా బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది. ఇక నిన్నటికి నిన్న వినాయక చవితి సందర్భంగా ఆమె కుటుంబంతో కలిసి పూజ జరుపుకున్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
అంతగా ఆ ఫొటోలో ఏముంది అంటే.. ఏమి లేదు.. భర్త సుందర్, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది అంటే.. ఫ్యామిలీ మొత్తం బరువు తగ్గి కనిపించారు. ముఖ్యంగా ఖుష్బూ కూతుర్లు.. తల్లి అందాన్ని పుణికిపుచ్చుకుని హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు ఖుష్బూతో పాటు ఆమె కూతుర్లు అవంతిక, ఆనందిత ఇద్దరూ అధిక బరువుతో కనిపించేవారు. వారిని చూసి నెటిజన్స్ ట్రోల్ చేశారు. తల్లిలానే పిల్లలు కూడా అంటూ నీచమైన కామెంట్స్ చేశారు. దీంతో కుటుంబం మొత్తం వైట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసింది.
ఎన్నేళ్లు కష్టపడ్డారో తెలియదు కానీ.. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఖుష్బూ ఎంత సన్నగా మారిందో అందరూ చూసారు. ఈ ఫొటోలో ఆమె కూతుర్లు కూడా చాలా బరువు తగ్గి సన్నజాజి తీగల్లా మారిపోయి కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు ఇంత డిఫరెన్స్ ఎలా.. అవంతిక, ఆనందిత హీరోయిన్స్ లానే కనిపిస్తున్నారు అంటూ ట్రోల్ చేసినవారే సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ సుందర్ సి.. ఇద్దరు కూతుర్లను హీరోయిన్స్ గా పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకే వారిద్దరూ బరువు తగ్గారని సమాచారం. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్లు డైరెక్టర్ తలుచుకుంటే కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడం పెద్ద విషయమేమి కాదు.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పెద్ద కూతురు అవంతిక తండ్రిలా డైరెక్టర్ గా మారుతుండగా.. చిన్న కూతురు ఆనందిత తల్లిలా హీరోయిన్ గా మారబోతుంది. త్వరలోనే వీరిద్దరిని ఖుష్బూ సుందర్ ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నారు. ఏదిఏమైనా ఈ కుటుంబం ఎంతో డెడికేషన్ గా బరువు తగ్గడం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. సూపర్, శభాష్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి సుందర్ సి వారసురాళ్లు ఇండస్ట్రీలో ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.