iPhone Unit: కుప్పం నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. రకరకాల ఎగుమతులకు ఆ ప్రాంతాన్ని కేరాఫ్‌గా మార్చాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుప్పంలో పెట్టుబడి పెట్టేందుకు ఓ కంపెనీ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. ఆ కంపెనీ అక్కడ ఐఫోన్ ఛాసిస్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
దేశంలో అల్యూమినియం తయారీ కంపెనీ హిందాల్కో. ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ చూపు ఏపీపై పడింది. అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కుప్పంలో భారీ పారిశ్రామిక ప్రాజెక్ట్ నిర్మించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆ సంస్థ దాదాపు రూ. 586 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
అక్కడ తయారయ్యే అల్యూమినియం భాగాలు, ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌లకు ఛాసిస్ లేదా ఎన్‌క్లోజర్ తయారీలో కీలకమైన ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు-SIPB ఆమోదించడమే మిగిలివుంది. ఈ యూనిట్ కేవలం ఏపీకి మాత్రమే కాకుండా దేశానికి మైలురాయిగా నిలవనున్నట్లు కొందరు అధికారుల మాట.
అంతా అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని ఆలోచన చేస్తోంది. నాలుగేళ్లలో సుమారు 613 ఉద్యోగాలను సృష్టిస్తుందని ఓ అంచనా. అక్కడ తయారు చేసే ముడి పదార్ధాలను ఐఫోన్ తయారీ యూనిట్లకు పంపబడుతుంది. ఐఫోన్ సరఫరాలోకి అధికారికంగా ఏపీ ప్రవేశించనుంది.
ALSO READ: సినిమాలకు గుడ్ బై.. పవన్ ప్లాన్ ఇదేనా?
AP ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ-2025 కింద ఆ ప్రాజెక్టు ఆమోదం పొందునుంది. ఈ పాలసీ ద్వారా హిందాల్కో సంస్థకు సబ్సిడీ భూమి, ఇతర ప్రోత్సాహకాలు రానున్నాయి. హిందాల్కో కంపెనీ కుప్పంను ఎంచుకోవడం అనేక కారణాలు ఉన్నాయి. చంద్రబాబు నియోజకవర్గం అనేది కాదేకాదు. కుప్పం భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాంతం.
బెంగళూరు నుండి కేవలం 120 కిలోమీటర్లు దూరంలో ఉంది. అలాగే చెన్నైకి కేవలం 200 కిలోమీటర్లు దూరంలో ఉండడం వల్ల ఆ ప్రాంతానికి కలిసివస్తుందని అంటున్నారు. ఇటీవల ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇటు ఏపీ.. అటు బెంగుళూరు-చెన్నైలకు ఆ ప్రాంతం కీలకం కానుంది.
పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకోవడానికి అనువైన స్థానం అవుతుందని అన్నారు. ఇప్పటికే అక్కడ ఫాక్స్‌కాన్ రెందో అతిపెద్ద యూనిట్‌ను ప్రారంభించింది. చిన్నస్థాయిలో ఐఫోన్ 17 ఉత్పత్తి మొదలుపెట్టింది కూడా.
దీనికితోడు SIRMA SGS టెక్నాలజీ సంస్థ సుమారు రూ. 1,800 కోట్ల పెట్టుబడితో అతిపెద్ద మల్టీ-లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్-PCB-కాపర్ క్లాడ్ లామినేట్-CCL తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. వీటి ద్వారా కుప్పం హైటెక్ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. ఐఫోన్ తయారీలో ఉపయోగించే చాసిస్, విడిభాగాలు, పీసీబీలు దేశంలో తయారవుతున్నాయి.
దీనివల్ల మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి చేరువకానుంది. అటు సీఎం చంద్రబాబు అక్కడ ఎయిర్‌పోర్టు కార్గో విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ కార్గో ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోవడం ఖాయమని అంటున్నారు.