The Raja Saab: టాలీవుడ్ స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్(Prabhas) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక ఈయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది అవుతుంది. గత ఏడాది కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టిన ప్రభాస్ త్వరలోనే ది రాజా సాబ్ (The Raja Saab)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మారుతి(Maruthi) దర్శకత్వంలో హర్రర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ ఎన్నో అంచనాలను పెంచేసాయి.
జనవరి 9న రాబోతున్న రాజా సాబ్..
ఇకపోతే ఈ సినిమా ఇదివరకే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే డిసెంబర్ 5వ తేదీ విడుదల అవుతుందని చిత్ర బృందం వెల్లడించారు. అయితే ఇటీవల మరోసారి ఈ సినిమా వాయిదా పడిందని వార్తలు కూడా వచ్చాయి.. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల గురించి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్(TG Vishwa Prasad) మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ నటించిన ఈ సినిమా 2026 జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు. ఇలా ఈ సినిమా విడుదల గురించి నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే జనవరి 9న ఈ సినిమా విడుదల అయితే వర్కౌట్ అవుతుందా అంటూ మరికొంతమంది సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతి బరిలోనే ప్రభాస్ రాజా సాబ్…
సాధారణంగా సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద సినిమాల నుంచి మొదలుకొని చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ బరిలో దిగుతుంటాయి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చాలా సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే ప్రభాస్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం సరైన నిర్ణయమేనా? అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలు విడుదలవుతున్న తరుణంలో ప్రభాస్ సినిమా విడుదల చేస్తే అది కలెక్షన్ల పై ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పాలి.
ప్రభాస్ కి జోడిగా ముగ్గురు ముద్దుగుమ్మలు..
తాజాగా ఈ సినిమా విడుదల గురించి నిర్మాత విశ్వప్రసాద్ మిరాయ్(Mirai) ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తెలియజేశారు. ఈ విధంగా ప్రభాస్ సినిమా గురించి అప్డేట్ వచ్చినప్పటికీ అన్ని సినిమాలతో పాటు కాకుండా ప్రభాస్ సినిమా సింగిల్ గా రిలీజ్ అయితే బాగుండనే అభిప్రాయాన్ని కూడా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూడబోతున్నామని ఇదివరకే విడుదల చేసిన పోస్టర్లు చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ (Nidhi Agarwal )తో పాటు, మాళవిక మోహన్(Malavika Mohanan), రిద్ది కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటించబోతున్నారు.
Also Read: Navadeep: తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఐయామ్ సారీ అంటూ నవదీప్ వీడియో