BigTV English

Artificial Beach: హైదరాబాద్ కు బీచ్ వచ్చేసింది, ఇక ఎంజాయే ఎంజాయ్!

Artificial Beach: హైదరాబాద్ కు బీచ్ వచ్చేసింది, ఇక ఎంజాయే ఎంజాయ్!

Hyderabad Artificial Beach: హైదరాబాద్ లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. చారిత్రకు సరస్సులు, అద్భుతమైన కట్టడాలు, ఆకట్టుకునే సంస్కృతి కనువిందు చేస్తాయి. కానీ, హైదరాబాద్ లో బీచ్ అందాలను చూసే అవకాశం లేదు. కారణం ఇక్కడ సముద్రం లేదు. ఒకవేళ బీచ్ లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఏపీలోని సూర్యలంకకు వెళ్తుంటారు. అక్కడి ఇసుక తిన్నెల్లో ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో బీచ్ లేదే అని నిరాశలో ఉన్న వారికి సంతోషకరమైన వార్త. ఇకపై హైదరాబాద్ లోనూ బీచ్ అందాలను చూసే అవకాశం ఉంది. సూర్యలంక మాదిరిగా ఎంజాయ్ చెయ్యొచ్చు కూడా. ఎలాగంటే..


హైదరాబాద్ లో ఆర్టిఫీషియల్ బీచ్

హైదరాబాద్ శివార్లలోని కోత్వాల్ గూడ సమీపంలో బీచ్ అందాలు కనువిందు చేయబోతున్నాయి. అక్కడ ఓ భారీ కృత్రిమ బీచ్‌ ను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను కూడా ఆవిష్కరించింది. 35 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండే ఈ ప్రాజెక్టులో బీచ్ లాంటి పరిసరాలతో మానవ నిర్మిత సరస్సును ఏర్పాటు చేయనున్నారు. ఇది హైదరాబాద్‌ ను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మారుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.  ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) మోడల్ కింద రూ. 225 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మించబోతున్నారు . ఈ డిసెంబర్‌ లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.


ఇప్పటికే పలు దేశాల్లో కృత్రిమ బీచ్ లు

కృత్రిమ బీచ్‌ ల నిర్మాణం అనేది కొత్తవేం కాదు. పలు దేశాలు  వీటిని ఏర్పాటు చేశాయి. అధునాతన అల వ్యవస్థలు, వాటర్ స్పోర్ట్స్ జోన్లు, ఆధునిక సౌకర్యాలతో నిర్మించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు కృత్రిమ బీచ్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

ఆర్టిఫీషియల్ బీచ్ లో ఏం ఉంటాయంటే?

ఇక ఈ కృత్రిమ బీచ్.. నిజమైన బీచ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటాయి. స్టార్ హోటళ్ళు,  అద్భుతమైన స్టే హోటళ్లు. అలలపై తేలియాడే విల్లాలు ఆకట్టుకోనున్నాయి. బంగీ జంపింగ్, స్కేటింగ్, సెయిలింగ్, శీతాకాలపు క్రీడలు వంటి సాహస క్రీడలు ఉంటాయి. పార్కులు, ఆట స్థలాలు, సైక్లింగ్ జోన్లు, జాగింగ్ ట్రాక్‌ లతో సహా ఫ్యామిలీ ఎంజాయ్ చేసేలా ఉంటాయి.  ఫుడ్ కోర్టులు, థియేటర్లు, అలంకార ఫౌంటెన్లు, వేవ్ పూల్ లాంటి విశ్రాంతి స్థలాలు ఉంటాయి. బీచ్‌ను మాత్రమే కాకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే అన్ని సదుపాయాలను అందులో ఏర్పాటు చేయనున్నారు.

కొత్వాల్ గూడలోనే ఆర్టిఫీషియల్ బీచ్ ఏర్పాటు ఎందుకు?

ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న నేపథ్యంలో కనెక్టివిటీకి ఈజీగా ఉంటుందని ఎంచుకున్నారు. పర్యావరణ అనుకూలతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రదేశం పెద్ద ఎత్తున అభివృద్ధికి వీలు కలిగేలా నిర్ణయం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రణాళిక ప్రకారం పూర్తయితే, హైదరాబాదీలు త్వరలో నగరాన్ని దాటకుండానే బీచ్‌ లో వీకెండ్ గడిపే అవకాశం ఉంటుంది.

Read Also:  అక్టోబర్ నాటికి సీప్లేన్ సేవలు.. రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన!

Related News

Top 5 Malls in Hyderabad: హైదరాబాద్ లో టాప్ 5 మాల్స్, ఏడాదంతా డిస్కౌంట్లే డిస్కౌంట్లు!

Seaplane Services: అక్టోబర్ నాటికి సీప్లేన్ సేవలు.. రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన!

Trains Diverted: సికింద్రాబాద్ నుంచి 18 రైళ్లు డైవర్ట్, కారణం ఏంటంటే?

Trains Cancelled: కుండపోత వర్షాలు, రాష్ట్రంలో పలు రైళ్లు రద్దు!

Railway updates: భారీ వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణలో పలు రైళ్ల దారి మళ్లింపు!

Big Stories

×