BigTV English

Richest Village: ఆ ఊళ్లో ప్రతి రైతూ కోటీశ్వరుడే.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడంటే!

Richest Village: ఆ ఊళ్లో ప్రతి రైతూ కోటీశ్వరుడే.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడంటే!

Richest Village: ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం మన దేశంలోనే ఉందని మీకు తెలుసా? ఈ ధనిక గ్రామంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. 24 గంటల విద్యుత్ అందుబాటులో ఉంది. ఈ గ్రామంలో చాలా పెద్ద బ్యాంకులు.. ఒక పెద్ద హాస్పిటల్ కూడా ఉంది. పిల్లల విద్య కోసం ఆధునిక డిజిటల్ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అందరు ప్రజలు లక్షలాధికారులే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ధనిక గ్రామం గురించి తెలుసుకుందాం.


నగరాలే సిగ్గుపడేలా ఇక్కడ సౌకర్యాలు..
గ్రామం అనే పదం వినగానే మనకు గుర్తుకు వచ్చే చిత్రాలు ఎక్కువగా మట్టి ఇల్లు, బావులు, పచ్చని పొలాలు కష్టపడి పని చేసే రైతులు బావుల నుంచి నీరు తెచ్చుకునే మహిళలు మట్టి రోడ్లు గుర్తొస్తాయి. నేటికి చాలా గ్రామాలకు విద్యుత్, నీరు, మంచి రోడ్లు, మంచి పాఠశాలలు, పెద్ద హాస్పిటల్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. అయితే భారతదేశంలో ఒక గ్రామం ఉంది. ఈ గ్రామం ముందు పెద్ద పెద్ద నగరాలు కూడా దిగదుడిపే అనిపిస్తుంది. ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం. ఇక్కడ ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రామం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. దీని పేరు మధుపర్. ఈ గ్రామం మొత్తం జనాభా ఇప్పుడు దాదాపు 92,000 అంటే దాదాపులక్ష.

ఈ గ్రామం ఇంత ధనిక గ్రామం ఎలా అయిందంటే..
ఈ గ్రామంలో 7,600 ఇల్లు ఉన్నాయి. అంతేకాకుండా ఒకటి లేదా రెండు కాదు 17 బ్యాంకు శాఖలు ఉన్నాయి. మధుపర్ గ్రామ ఆర్థిక పరిస్థితి కూడా చాలా బలంగా ఉంటుంది. గ్రామ ప్రజలు ఈ బ్యాంకుల్లో దాదాపు 5000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్ చేశారు. అతి పెద్ద నగరాల్లో కూడా ఇంత పెద్ద మొత్తాన్ని చాలా కష్టంతో బ్యాంకుల్లో జమ చేస్తారు. ఈ గ్రామం ఇంత ధనిక గ్రామం ఎలా అయిందంటే మధుపరిలోని అనేక కుటుంబాలు వ్యాపారం ఉపాధి కోసం విదేశాల్లో స్థిరపడ్డాయి. ఈ గ్రామ ప్రజల పరిశ్రమలు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆఫ్రికా గల్ఫ్ దేశాల్లో అభివృద్ధి చెందుతున్నాయి.


800 సంవత్సారాల క్రితం స్థిరపడిన గ్రామం..
అయితే ఆ గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని మర్చిపోలేదు. ఈ ఎన్ఆర్ఐలు ప్రతి నెల తమ కుటుంబాలకు భారి మొత్తంలో డబ్బులు పంపుతారు. ఈ ప్రజలు గ్రామ అభివృద్ధికు కూడా ఎంతో సహకరిస్తున్నారు. గ్రామంలో విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సామాజిక పనులలో వారు సహాయం చేస్తారు. ఈ గ్రామాన్ని ఆధునికంగా మార్చడంలో ఈ ప్రవాసాంధ్రులు పెద్ద పాత్ర పోషించారు. ఈ గ్రామం 12వ శతాబ్దంలో స్థిరపడింది. అంటే ఈ గ్రామం స్థిరపడి 800 సంవత్సరాలకు పైగా అయింది. కంచులోని మిస్త్రీ సమాజంలో ఈ గ్రామానికి పునాది వేసింది.

Also Read: పొన్నం టార్గెట్ రీచ్ అవుతాడా?

ఈ సమాజం గుజరాత్లోనే కాకుండా భారతదేశం అంతటా అనేక ముఖ్యమైన దేవాలయాలను నిర్మించింది. అనేక చారిత్రక భవనాలు కూడా నిర్మించింది. తర్వాత అనేక వర్గాల ప్రజలు ఈ గ్రామంలో నివసించడం మొదలు పెట్టారు. నేడు ఈ గ్రామంలో పంజాబీ, గుజరాతీ, బెంగాళీ, తమిళం, మరాఠి, కాశ్మీరి వంటి అన్ని రకాల ప్రజలు నివసిస్తున్నారు. ఈ గ్రామంలో నగరాల కంటే మెరుగైన సౌకర్యాలు మధుపరిలో పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ఆరోగ్య కేంద్రాలు, తోటలు, రోడ్లు సహా ఏ పెద్ద నగరాన్నైనా సిగ్గుపడేలా చేసే సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ జీవనశైలి సౌకర్యాలు నగరం కంటే చాలా మెరుగుగా ఉంటాయి. ఇక్కడి గ్రామం వేగంగా అభివృద్ధి చెందుతూ నగరాన్ని అధిగమించింది. ఈ గ్రామం భారతదేశంలో నిజమైన బలం గ్రామాలలో ఉందని సందేశం చెప్పకనే చెబుతుంది.

Related News

Modi Government: వాటిపై పన్ను కట్టాల్సిన పని లేదు.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Trump Tariffs Effect: అమెరికా 50% పన్ను ప్రభావం.. 40 దేశాల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తోన్న భారత్

High Alert In Bihar: రాష్ట్రంలో హైఅలర్ట్.. బీహార్‌లోకి జైషే ఉగ్రవాదుల చొరబాటు

US Drinks Ban: ట్రంప్ టారిఫ్.. అమెరికాకు షాకిచ్చిన వర్సిటీ, శీతల పానీయాలపై నిషేధం

Palghar Building Collapse: మహారాష్ట్రలోని విరార్‌లో కూలిన భవనం.. 15 మంది మృతి

Big Stories

×