Sundarakanda Collection :ప్రతినిధి 2, భైరవం చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నారా రోహిత్ (Nara Rohit) తాజాగా నటించిన చిత్రం సుందరకాండ (Sundarakanda ). వెంకటేష్ నిమ్మలపూడి (Venkatesh Nimmalapudi) దర్శకత్వంలో ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ద్వారా ప్రముఖ సీనియర్ బ్యూటీ శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijay Kumar)రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో శ్రీదేవితో పాటు వృతి వాఘాని (Vruti Vaghani) మరో హీరోయిన్ గా నటించారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సుందరకాండ ఫస్ట్ డే కలెక్షన్స్..
అసలు విషయంలోకి వెళ్తే.. నారా రోహిత్ తాజాగా నటించిన చిత్రం సుందరాకాండ. ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అని కొంతమంది రివ్యూ ఇవ్వగా.. ఇంకొంతమంది మిక్స్డ్ రివ్యూలు ఇస్తున్నారు. మొత్తానికైతే నారా రోహిత్ కి ఇది కలిసి వచ్చే మూవీ అని చెప్పవచ్చు. కానీ మొదటి రోజు కలెక్షన్లు మాత్రం దారుణంగా పడిపోయాయి. కనీసం రూ.50 లక్షలు కూడా దాటకపోవడం గమనార్హం. ఈ సినిమాను నిర్మాతలు దాదాపు రూ.13 కోట్లు పెట్టి నిర్మించారు. అటు ఓటీటీతో పాటు డిజిటల్ రైట్స్ కి ఈ సినిమాకు రూ.7 కోట్లు వచ్చాయి. అందులో జీఎస్టీ తో పాటు ఇతర టాక్స్ లు కలుపుకుంటే నిర్మాత చేతికి వచ్చింది కేవలం రూ.6కోట్లే. మరి పెట్టిన పెట్టుబడిలో రూ.6 కోట్లు వస్తే మిగిలిన రూ.7కోట్లు నిర్మాతకు వచ్చి చేరాలి. అప్పుడే ఈ సినిమా హిట్ అయినట్టు.. మొదటి రోజు వచ్చిందే 50 లక్షల లోపు.. ఫుల్ రన్ ముగిసే సరికి మిగతా ఏడు కోట్లు రాబడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా బిగ్ డిజాస్టర్ కాబోతోంది అని అనుమానాలు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.
సుందరకాండ సినిమా స్టోరీ..
సుందరకాండ సినిమా స్టోరీ విషయానికి వస్తే సిద్ధార్థ్ (నారా రోహిత్) ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటారు. మూడు పదుల వయసు దాటినా.. అమ్మాయిల్లో తనకు నచ్చిన ఐదు క్వాలిటీస్ లేవంటూ పెళ్లి సంబంధాలను తిరస్కరిస్తుంటాడు. స్కూల్లో తనకు సీనియర్ అయిన వైష్ణవి (శ్రీదేవి విజయ్ కుమార్) లో చూసిన ఐదు లక్షణాలు తనకు కాబోయే భార్యలో ఉండాలనేదే సిద్ధార్థ్ కోరిక. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా అందులో రాజీ పడడు. ఇక ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్టులో ఐరా (వృతి వాఘాని) సిద్ధార్థ్ కి ఎదురవుతుంది.తొలి పరిచయంలోనే ఆమెలో తనకు నచ్చే కొన్ని లక్షణాలను సిద్ధార్థ్ గమనిస్తాడు . దాంతో తన ప్రయత్నాన్ని రద్దు చేసుకొని పెళ్లి చేసుకోవాలని ఆమెను పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లి గురించి మాట్లాడేందుకు తన కుటుంబంతో కలిసి ఐరా ఇంటికి వెళ్ళగా.. అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ? సిద్ధార్థ్ ఐరాను వివాహం చేసుకున్నారా? అనే విషయం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
ALSO READ:Akhanda 2: వినయక చవితి రోజు కూడా మౌనమే… బాలయ్య వెనకడుగు లాంఛనమేనా ?