Teja Sajja: తేజ సజ్జ(Teja Sajja) పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన నటనతో మెప్పించిన తేజ ప్రస్తుతం హీరోగా కూడా ఇండస్ట్రీలో తన స్టామినా ఏంటో నిరూపించుకుంటూ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్(Mirai) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నారు. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా పడింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు .
పాన్ఇండియా స్టార్ అని పిలవద్దు..
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా తేజ సజ్జ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కొట్టబోతున్నారని స్పష్టమవుతుంది. ఈ సినిమాలో మంచు మనోజ్(Manchu Manoj) విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అనంతరం చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్ల నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. తేజ సజ్జను పాన్ ఇండియా స్టార్ (Pan India Star)అని పిలిస్తే మాత్రం తనకు అసలు నచ్చదని పలు సందర్భాలలో తెలియజేశారు. అయితే ఎందుకు నచ్చదు? ఏదైనా ఇబ్బందిగా ఉంటుందా? అనే ప్రశ్న ఈ సందర్భంగా ఎదురయింది.
హనుమాన్ పాన్ ఇండియా హిట్ మూవీ..
ఈ ప్రశ్నకు తేజ సమాధానం చెబుతూ.. పాన్ ఇండియా స్టార్ అని పిలిస్తే మనకేమీ పర్లేదు కానీ పక్కన వాళ్ళ మన వైపు అదోలా చూస్తూ వీడికి అంత ఉందా? అనే భావనలో ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే నాకు అలా పిలిపించుకోవడం నచ్చదని ఈ సందర్భంగా తేజ సజ్జ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇదివరకే ఈయన నటించిన హనుమాన్(Hanuman) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఈయనకు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు రావడంతోనే తనని అందరూ పాన్ ఇండియా హీరో అని పిలుస్తున్నారు.
మిరాయ్ తో హిట్ కొట్టబోతున్నాం…
ఇక మిరాయ్ సినిమా విషయానికి వస్తే..కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ 8 భాషలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad)నిర్మించారు. ఇక సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఈసారి విశ్వప్రసాద్ భారీ హిట్ అందుకోబోతున్నారని స్పష్టం అవుతుంది. ఈ సినిమా విషయంలో విశ్వప్రసాద్ కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. గత ఏడాది ప్రేక్షకులను నిరాశపరిచిన ఈసారి మాత్రం మనం హిట్ కొట్టబోతున్నాం అంటూ ధీమా వ్యక్తం చేశారు. మరి మిరాయ్ సినిమా తేజ సజ్జ, మంచు మనోజ్ కు ఏ విధంగా కలిసి వస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: The Raja Saab: ఇట్స్ అఫీషియల్.. ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ అప్పుడే..కానీ వర్కౌట్ అయ్యేనా?