Jio Special Offer: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో తక్కువ ధరలో కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ సదుపాయాలు లభించనున్నాయి. ముఖ్యంగా రూ.91, ప్లాన్ వినియోగదారులకు బెస్ట్ ఛాయిస్‌గా నిలిచింది.
రూ.91 ప్లాన్ గురించి చూద్దాం
రూ.91 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ ఉంది. ప్రతి రోజు 100 ఎంబీ హై స్పీడ్ డేటా, 200 ఎంబీ అదనపు డేటా, 50 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తాయి. మొత్తం 28 రోజులలో వినియోగదారులు 3జీబీ డేటా ప్రయోజనం పొందగలరు. డేటా పరిమితి తాకితే, ఇంటర్నెట్ స్పీడ్ 64కేబీపీఎస్‌కి పడిపోతుంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, ఈ ప్లాన్ కేవలం డేటా ఓచర్ మాత్రమే కాదు. జియోఫోన్ ప్రైమ్ సభ్యులు ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో క్లౌడ్ స్టోరేజ్ వంటి ఆన్‌లైన్ సర్వీసులను కూడా ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే, రూ.91కి వినియోగదారులు కాలింగ్, ఎస్ఎంఎస్, డేటా మాత్రమే కాకుండా, జియో ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసుల ఫీచర్‌లను కూడా పొందుతున్నారు.
Also Read: GST on Cable TV: 18 నుంచి 5 శాతం జీఎస్టీ.. నెలవారీ టీవీ బిల్లులకు భారీ ఊరట!
రూ. 75 ప్లాన్ గురించి తెలుసుకుందాం..
అలాగే, రూ.75 ప్లాన్ కూడా వినియోగదారుల కోసం అందుబాటులో ఉంది. దీని వ్యాలిడిటీ 23 రోజులుగా ఉంటుంది. ప్రతిరోజూ 0.1 జీబీ హై స్పీడ్ డేటా, 200 ఎంబీ బోనస్ డేటా, 50 ఎస్ఎమ్ఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కూడా జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ లభిస్తుంది.
జియో మరిన్ని ఆఫర్లు
ఈ రెండు తక్కువ ధర ప్లాన్‌లకే పరిమితం కాకుండా, జియో మరిన్ని ఆప్షన్‌లను కూడా అందిస్తోంది. రూ.125, రూ.152, రూ.186, రూ.223 వంటి రీఛార్జ్ ప్లాన్‌లలో వినియోగదారులు తమ అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు. ప్రత్యేకంగా రూ.895 ప్లాన్, 336 రోజుల చెల్లుబాటుతో, తక్కువ ధరలో ఎక్కువ డేటా, ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్లాన్‌లు తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను కోరుకునే జియో ఫోన్ వినియోగదారులకు అత్యంత ఉపయోగకరమైన ఆఫర్‌గా నిలుస్తాయి. డేటా, కాలింగ్, ఎస్ఎమ్ఎస్, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలను ఒక్క ప్లాన్‌లో పొందగలిగే అవకాశం ఈ ప్లాన్‌లతో వచ్చింది.