BigTV English

Pawan Kalyan: జగన్‌కు ‘అప్పురత్న’ అవార్డు.. 9 నెలల్లో 55,555 కోట్ల అప్పు..

Pawan Kalyan: జగన్‌కు ‘అప్పురత్న’ అవార్డు.. 9 నెలల్లో 55,555 కోట్ల అప్పు..

Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ ఈమధ్య దూకుడు మరింత పెంచారు. ఎన్నికల ఇయర్ అని కాబోలు.. జగన్ పై, వైసీపీ నేతలపై బాగా ఫైర్ అవుతున్నారు. మధ్యలో మంత్రులు అమర్నాథ్, అంబటిలు రాజకీయాలను మరింత రంజుగా మార్చేస్తున్నారు. ఇలా ఏపీ పాలిటిక్స్ అన్ స్టాపబుల్ గా సాగుతున్నాయి.


లేటెస్ట్ గా జగన్ కు ఖతర్నాక్ బిరుదు ఇచ్చారు పవన్ కల్యాణ్. ఇటీవల కేంద్ర పద్మ అవార్డులు ప్రకటించడంతో ఆ థీమ్ కు పేరడీగా.. భారతరత్న మాదిరిగా.. సీఎం జగన్ కు ‘అప్పు రత్న’ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనసేనాని చేసిన ఆ ట్వీట్‌.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏపీ సర్కారు చేస్తున్న అప్పులు.. కొత్త రికార్డులు నమోదు చేసే స్థాయికి చేరుకుంటున్నాయి. గడచిన 9 నెలల కాలానికి ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.55,555 కోట్లకు చేరింది. ఆ విషయం గుర్తు చేస్తూ పవన్ సెటైరికల్ గా ట్వీట్ చేశారు.


‘‘అప్పులతో ఏపీ పేరు మారుమోగిస్తున్నందుకు సీఎం జగన్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు. అప్పులతో ఆంధ్రా పేరును ఇలానే కొనసాగించండి. మీ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం మాత్రం మరచిపోవద్దు. రాష్ట్రాభివృద్ధి, సంపదను కుక్కలకు వదిలేయండి. భారతరత్న మాదిరిగా మీకు ‘అప్పురత్న’ అవార్డు ఇవ్వాలి’’ అంటూ ట్విట్టర్ లో పవన్ సెటైర్లు వేశారు.

Related News

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?

Kakinada: స్వదేశానికి కాకినాడ మత్స్యకారులు.. ఎంపీ సానా సతీష్ బాబు ప్రయత్నాలు సఫలం

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Big Stories

×