Prakasam District: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో గుండెలు పిండేసే దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై ఒక కిరాతకుడు అత్యాచారానికి ఒడిగట్టి, ఆపై ప్రాణాలు తీశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని కలిగించింది.
అమ్మమ్మ వద్ద ఉంటుండగా వెలుగు చూసిన విషాదం
పాప తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లి బేల్దారి పనులు చేసుకుంటున్నారు. దీంతో బాలిక నాగులుప్పలపాడులోని అమ్మమ్మ వద్దే ఉంటోంది. ఆదివారం అర్ధరాత్రి వేళ ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న చిన్నారిని, అదే కాలనీకి చెందిన ఆనంద్ అనే వ్యక్తి రహస్యంగా ఎత్తుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై దారుణానికి పాల్పడి, ఆపై హత్య చేశాడు.
కుర్చీలో మృతదేహం.. నిందితుడికి దేహశుద్ధి
పాపను చంపేసిన అనంతరం, మృతదేహాన్ని తెచ్చి ఇంటి ముందున్న కుర్చీలో కూర్చోబెట్టి నిందితుడు పరారయ్యేందుకు యత్నించాడు. చిన్నారి పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమై నిందితుడు ఆనంద్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.
Also Read: మామను మించిన అల్లుడు.. అబద్ధాల్లో హరీష్‌దే నంబర్ 1: మెట్టుసాయి కుమార్