E-Paper
Advertisement

మామను మించిన అల్లుడు.. అబద్ధాల్లో హరీష్‌దే నంబర్ 1: మెట్టుసాయి కుమార్

మామను మించిన అల్లుడు.. అబద్ధాల్లో హరీష్‌దే నంబర్ 1: మెట్టుసాయి కుమార్
Advertisement

Mettu Sai Kumar: గాంధీభవన్ వేదికగా పీసీసీ ఫిషరీ సెల్ చైర్మన్ మెట్టుసాయి కుమార్ బీఆర్ఎస్ నాయకత్వంపై, ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుపై ధ్వజమెత్తారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు పూర్తిగా విఫలమయ్యారని, అబద్ధాలు చెప్పడంలో తన మామ కేసీఆర్‌ను మించిపోయారని ఎద్దేవా చేశారు. ఆయన పేరు తన్నీరు హరీష్ రావు కాదని, ‘అబద్ధాల హరీష్ రావు’ అని వ్యాఖ్యానించారు.

గోడ కట్టకముందే గోపురం కూలింది

Advertisement

నిన్న మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ నాయకులకు అసలు దాని నిర్మాణం, ఖర్చులపై కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. మేడిగడ్డ పాపం పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మొదట 2,500 కోట్ల అంచనా వ్యయంతో ఉన్న ప్రాజెక్టును 4,500 కోట్లకు పెంచారని, ఇప్పుడు దానికి మరమ్మతులు చేయాలన్నా మరో 700 నుండి 2,000 కోట్ల రూపాయలు కావలసి వస్తోందన్నారు. ‘గోడ కట్టకముందే గోపురం కూలింది’ అన్న చందంగా కాళేశ్వరం పరిస్థితి తయారైందన్నారు. దీనికి హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బిఆర్ఎస్ నంబర్-2 కోసం ఆరాటం

Advertisement

బీఆర్ఎస్‌లో నంబర్-2 స్థానం కోసం హరీష్ రావు ఎంత ఎగిరి ఎగిరి దంచినా ఆ పదవి ఆయనకు దక్కదని సాయి కుమార్ వ్యాఖ్యానించారు. పార్టీలో సీనియర్లుగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావులకు నాయకత్వ లక్షణాలు లేవా అని ప్రశ్నించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యే అర్హత లేదా అని నిలదీశారు.

వలస నాయకుల అక్రమాలు

తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, వివేకానంద గౌడ్ వంటి వారు కేవలం అద్దెకు వచ్చిన నాయకులని అభివర్ణించారు. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చేసిన అక్రమాలు చాలా ఉన్నాయని, త్వరలోనే వారి చిట్టా బయటపడుతుందని హెచ్చరించారు.

Also Read: సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టినా చంద్రబాబుకి బుద్ధి రాలేదు: కాకాణి గోవర్ధన్ రెడ్డి

Tags

Related News

ఎల్ నినో కరువు మండలాల లెక్కింపుపై.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

టికెట్ గొడవ.. కండక్టర్‌ను రన్నింగ్ బస్సులోంచి తోసేసిన మహిళ!

ఆదిలాబాద్ జిల్లా ST కుల ధృవీకరణ పత్రాల వివాదానికి.. ప్రభుత్వం చెక్!

ORRపై ఘోర ప్రమాదం.. వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన వాహనం.. ఇద్దరు దుర్మరణం!

హైదరాబాద్ ‘సిటీ’వాసులకు సూచన.. కేవలం రూ.600 లకే బస్సు పాస్, ఇంకెందుకు ఆలస్యం

‘ధైర్యముంటే కొండగల్ రా.. సీఎం పవర్ ఏంటో చూపిస్తా’! జగదీష్ రెడ్డికి వేముల వీరేశం సవాల్

హైదరాబాద్‌లో నీటి వృథాపై నిఘా.. నవంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్, ఉల్లంఘిస్తే రూ. 5 వేలు ఫైన్

Big Stories

Advertisement
×