BigTV English

Prudhvi comments on Ambati, Mudragada: వైసీపీకి టైమ్ ఐపోయింది.. అంబటి, ముద్రగడకు ఈసారి

Prudhvi comments on Ambati, Mudragada: వైసీపీకి టైమ్ ఐపోయింది.. అంబటి, ముద్రగడకు ఈసారి

Prudhvi comments on Ambati, Mudragada(Andhra politics news): జగన్ సర్కార్‌పై సినీ నటులు దూకుడు పెంచారు. ఈ జాబితాలో ముందు ఉంటారు కమెడియన్ పృథ్వీరాజ్. వైసీపీ సర్కార్‌కు టైమ్ అయిపోయిందని, కేవలం వారం రోజులు మాత్రమే ఉందన్నారు. సోమవారం తిరుపతిలో మాట్లాడిన ఆయన, సినిమా స్టయిల్‌లో పంచ్ డైలాగ్స్ విసిరారు. జనం జేబుల్లో డబ్బులు వేస్తే అదే వైసీపీ అభివృద్ధి, అదే నినాదమన్నారు. మే 13న బాక్సులు బద్దలవుతాయన్నారు. వైసీపీని ఓడించేందుకు అందరకు కంకణం కట్టుకున్నారని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.


ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న డ్రామాలు ఏ సినిమాల్లోనూ ఉండవని, ఆ రేంజ్‌లో ప్రస్తుతం జరుగు తున్నాయని ఆరోపించారు పృథ్వీరాజ్. పనిలోపనిగా మంత్రి అంబటి రాంబాబుపై సెటైర్లు వేశారు. శ్యాంబాబు గురించి మంత్రి అంబటికి ఎందుకుని, అరగంట డ్యాన్స్ చేస్తే ఆయన్ని తాను ఇమిటేట్ చేయాలా? అంటూ ప్రశ్నించారు. సంక్రాంతి వేళ భోగి మంటలు వేసినప్పుడు అంబటిని పిలుస్తారని, ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఇస్తారని పంచ్ వేశారు.

పవన్ గురించి అంబటి చేసిన కామెంట్స్‌ను గుర్తు చేస్తూ.. మూడు పెళ్లిళ్లు, రెండు చోట్ల ఓడిపోవడాన్ని తనదైనశైలి వ్యాఖ్యలు చేశారాయన. సొంత అల్లుడే మంత్రి అంబటిని తిట్టారన్నారు. ప్రకృతి మారు తున్నప్పుడు దేవుడు ఇవన్నీ సృష్టిస్తాడన్నారు. మరో వైసీపీ నేత ముద్రగడ పైనా కామెంట్స్ చేశారు. ముద్రగడకు తాము ఎప్పుడో పేరు మార్చామని పద్మనాభరెడ్డిగా నామకరణం చేశామన్నారు.


ALSO READ: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ, వాస్తు దెబ్బ కొట్టిందా, వరుస షాక్‌లు?

అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్‌ని తిప్పికొట్టారు నటుడు పృథ్వీ. వైసీపీ నేతలు మాట్లాడితే ఆయన నాన్ లోకల్ అని అంటున్నారని, 2014 ఎన్నికల్లో విజయమ్మ విశాఖపట్నం నుంచి పోటీ చేసినప్పుడు ఆమె నాన్ లోకల్ కాదా అంటూ వైసీపీని సూటిగా ప్రశ్నించారు ఒకప్పుడు వైసీపీలో ఉండేవారు నటుడు పృథ్వీరాజ్‌. కాకపోతే అనివార్య కారణాల వల్ల ఫ్యాన్ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పేశారు. బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్‌లో నటించారు పృథ్వీ. ఆ మూవీ తర్వాత అంబటి వర్సెస్ పృథ్వీరాజ్‌గా మాటల యుద్ధం మొదలైంది.. తారాస్థాయికి చేరింది. అది ఇంకా కంటిన్యూ అవుతోంది.

Related News

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Big Stories

×