Lenin Film: తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి(Akkineni Family) ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు లెగసినీ నాగార్జున కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు నాగార్జున వారసులు నాగచైతన్య, అఖిల్(Akhil) హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నాగచైతన్య సినిమాలలో నటిస్తూ పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ అఖిల్ మాత్రం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్ద కాలమవుతున్న ఇప్పటివరకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఇలా అఖిల్ ఇండస్ట్రీలో సక్సెస్ కానీ నేపథ్యంలో అభిమానులు ఇక సినిమాలు ఆపి ఏదైనా బిజినెస్ చూసుకుంటే మంచిదేమో అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ఇలా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ నిరాశ ఎదురవుతున్నప్పటికీ అఖిల్ మాత్రం తరచూ విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక త్వరలోనే ఈయన లెనిన్ సినిమా(Lenin Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. వినరో భాగ్యము విష్ణు కథ సినిమా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishore Abburu)దర్శకత్వంలో అఖిల్ భాగ్యశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం లెనిన్. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కినదని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా షూటింగ్ పనులను సైలెంట్ గానే పూర్తి చేస్తున్నారు. అయితే అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్ విడుదల చేయగా సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసింది. ఈ అప్డేట్ తర్వాత తదుపరి ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదని తెలుస్తోంది. అయితే ఈ సినిమాని నవంబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా విడుదల తేదీ గురించి చిత్రపృందం ఎక్కడ ప్రకటించలేదు కానీ 17 తేదీ రాబోతోందని ఇండస్ట్రీ సమాచారం.
లెనిన్ తో హిట్ కొట్టేనా…
ఇక ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 80 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకుందని తెలుస్తోంది. అక్టోబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి అయితే నవంబర్ 17వ తేదీ ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన రాబోతోంది.
అఖిల్ చివరిగా ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.. మరి ఇప్పుడైనా లెనిన్ సినిమా అయ్యగారికి సక్సెస్ అందిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Actor Suhas: మరో బిడ్డకు తండ్రి అయిన నటుడు సుహాస్.. ఫోటో వైరల్!