OG Movie Music : ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎం. ఎం.కీరవాణి, అనిరుద్ రవిచంద్రన్, దేవి శ్రీ ప్రసాద్, తమన్ లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే టాలీవుడ్ లో ఎక్కువ అవకాశాలు మాత్రం ఎస్, ఎస్. తమన్ కి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఓ పక్క వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ లు అందిస్తున్న తమన్ మరోపక్క వరుస వివాదాలు కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈయన చేసే ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక పాట కచ్చితంగా కాపీ చేస్తారనే ఆరోపణలు ఈయనపై ఉన్నాయి. అందుకే తమన్ కొత్త సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారంటే చాలు ఆ సినిమాలో ఎన్ని కాపీ సాంగ్స్ ఉన్నాయో అని నెటిజన్స్ వెతికే పనిలో పడతారు.
అయితే తాజాగా విడుదలైన ఓజీ మూవీలో కూడా తమన్ కాపీ చేశారు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు ప్రూఫ్స్ తో సహా ఓ వీడియోని బయట పెడుతూ మళ్లీ కాపీ పెట్టేసాడురా భయ్యా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ ఓజీ మూవీలో తమన్ పెట్టిన ఆ కాపీ మ్యూజిక్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
also read:Tollywood: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ మూవీ!
ప్రూఫ్స్ తో సహా వైరల్..
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించారు . పవన్ కళ్యాణ్ నటించిన తాజా మూవీ ఓజీ . సుజీత్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ఎస్ తమన్ వ్యవహరించారు. అయితే ఈ సినిమాలో తమన్ ఒక్కచోట కూడా కాపీ మ్యూజిక్ పెట్టలేదు అని ఆయన ఫ్యాన్స్ ఆనందపడేలోపే తమన్ మళ్లీ కాపీ కొట్టాడు అంటూ ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇక ఓజీ మూవీలో విలన్ ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ సీన్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పూర్తిగా కాపీ అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక జపనీస్ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ ఉంది. ఈ మ్యూజిక్ అచ్చం పవన్ కళ్యాణ్ నటించిన ఓజి మూవీ లో ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ సీన్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందో అలాగే ఉంది.
కాపీ తమన్ అయిపోయాడు అంటూ కామెంట్స్..
ఇక ఈ మ్యూజిక్ ని బట్టి నెటిజన్స్ తమన్ మళ్లీ కాపీ కొట్టాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ఈ విషయం కాస్త వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు ఏమయ్యా తమనూ.. ఒక్క సినిమాలో అయినా కాపీ కంటెంట్ వాడకుండా ఉండవా..కాపీ చేసి చేసి కాపీ తమన్ గా మారిపోయావుగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి అయితే ఇలా కాపీ మ్యూజిక్ తో పవన్ కళ్యాణ్ అభిమానులను భారీగా మోసం చేశాడు తమన్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ కాపీ మ్యూజిక్ పై తమన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
ఈడు ఇది కూడా కాపీ కొట్టిండా 😡#OG pic.twitter.com/7YcsM4HhfK
— బ్రహ్మినామ్ బహురూపస్యః (@nagakishore981) September 26, 2025