BigTV English

Upcoming Movies in October : అక్టోబర్ లో థియేటర్లలోకి 17 సినిమాలు… అందులో 7 మాత్రం మోస్ట్ అవైటింగ్ మూవీస్

Upcoming Movies in October : అక్టోబర్ లో థియేటర్లలోకి 17 సినిమాలు… అందులో 7 మాత్రం మోస్ట్ అవైటింగ్ మూవీస్

Upcoming Movies in October : టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన నవంబర్ నెల ఎండింగ్ కు వచ్చేసింది. ఓజి పండగ సెలెబ్రేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అంతలోనే అక్టోబర్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలపై ఆడియన్స్ కన్ను పడింది. దసరా సెలవులు కలసి రావడంతో వచ్చే నెల ఏకంగా 17 సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో ఏడు సినిమాలు సౌత్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాల లిస్ట్ లో ఉన్నాయి. ఆ సినిమాలేంటి ? థియేటర్లలోకి ఎప్పుడు రాబోతున్నాయి ? అనే విషయంపై ఓ లుక్ వేద్దాం పదండి.


అక్టోబర్ లో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్

ఇడ్లీ కొట్టు – అక్టోబర్ 1
కర్మణే వాధికారిస్తే – అక్టోబర్ 1
కాంతారా చాప్టర్ -1 – అక్టోబర్ 2
శశివధనే – అక్టోబర్ 10
మారియో – అక్టోబర్ 10
సీత ప్రయాణం క్రిష్ణతో – అక్టోబర్ 10
ట్రాన్స్ ఎరిస్ – అక్టోబర్ 10
ఎర్రచీర – అక్టోబర్ 10
కానిస్టేబుల్ – అక్టోబర్ 10
మిత్రమండలి – అక్టోబర్ 16
తెలుసుకదా – అక్టోబర్ 17
ఫ్రెండ్లీ ఘోస్ట్ – అక్టోబర్ 17
డ్యూడ్ – అక్టోబర్ 17
కాంత – అక్టోబర్ 17
కె ర్యాంప్ – అక్టోబర్ 18
బాహుబలి ఎపిక్ – అక్టోబర్ 31
మాస్ జాతర – అక్టోబర్ 31

వారానికో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పండగే

ఈ 17 సినిమాల లిస్ట్ లో వారానికి ఒక మోస్ట్ అవైటింగ్ సినిమా అయినా ఉంది. అక్టోబర్ మొదటి వారమే మూడు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉంటే, అక్టోబర్ 10 న ఏకంగా ఆరు సినిమాలు బిగ్ స్క్రీన్ పై అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అక్టోబర్ 17 న నాలుగు సినిమాలు, అక్టోబర్ 31న రెండు సినిమాలు ఆడియన్స్ ని అలరించబోతున్నాయి. ఇందులో ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’, ‘కాంతారా చాప్టర్ 1’, సిద్ధు జొన్నల గడ్డ ‘తెలుసుకదా’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’, కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’, రవితేజ ‘మాస్ జాతర’ సినిమాలు ఉండటం విశేషం. ఇలా అక్టోబర్ నెల మొత్తం వారానికో ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమా రాబోతోంది.


‘దసరా’ను డబ్బింగ్ సినిమాలకొదిలేసిన టాలీవుడ్ 

సాధారణంగా దసరా కంటే సంక్రాంతి వంటి పెద్ద పండగ పైనే టాలీవుడ్ స్టార్ హీరోలు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా దసరా నెలలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుండడం క్యూరియాసిటీని పెంచుతోంది. నిజానికి మన హీరోలు దసరా పండగను డబ్బింగ్ సినిమాల కోసం వదిలేస్తారు, ఒకటి అరా సినిమాలు తప్ప పెద్దగా తెలుగు సినిమాలు థియేటర్లలో ఉండవు. ఎప్పటిలాగే ఈ దసరాను కూడా ఇంతర భాషల సినిమాలకు వదిలేశారు మన హీరోలు. కాకపోతే రవితేజ లాంటి సీనియర్ హీరోతో పాటు సిద్ధూ జొన్నలగడ్డ,  కిరణ్ అబ్బవరం వంటి యంగ్ హీరోలు మాత్రం అక్టోబర్ పైనే ఆశలు పెట్టుకున్నారు.

Read Also : అమ్మాయంటే పడి చచ్చే సోఫా… అబ్బాయిలు చెయ్యేస్తే చావే… ఇదెక్కడి దిక్కుమాలిన చేతబడి భయ్యా ?

Related News

Kantara Chapter1 Censor:  సెన్సార్ పూర్తి చేసుకున్న కాంతార చాప్టర్ 1..రన్ టైం ఎంతంటే?

Kantara: కాంతార యూనివర్స్ నుంచి మరో మూవీ… రిషబ్ ఇప్పుడేం ప్లాన్ చేస్తున్నాడంటే ?

Lenin Film: విడుదలకు సిద్ధమైన లెనిన్… అయ్యగారి రాక అప్పుడేనా?

OG Movie Music : ఓజీ మ్యూజిక్ పక్కా కాపీ… పవన్ ఫ్యాన్స్‌ను థమన్ ఎంత మోసం చేశాడు ?

Actor Suhas: మరో బిడ్డకు తండ్రి అయిన నటుడు సుహాస్.. ఫోటో వైరల్!

Emraan hashmi: ప్రేమకథతో రాబోతున్న మీ ఓమీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Puri – Sethupathi: పూరి – సేతుపతి మూవీకి వెరైటీ టైటిల్… అసలు ఈ థాట్ ఎలా వచ్చిందో ?

Big Stories

×