Martial Arts Action Thriller: కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తున్న వ్యక్తి జీవితంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంటే ఎలా ఉంటుంది… తన భార్య, కూతురిని దారుణంగా చంపిన వారు ఎవరో తెలుసుకున్న తర్వాత అతను న్యాయం కోసం ఎదురు చూడకుండా, వాళ్లను వెతుక్కుంటూ బయలుదేరితే… ఈ ప్రశ్నల చుట్టూ సాగే యాక్షన్ థ్రిల్లరే ‘స్ట్రైకింగ్ రెస్క్యూ’ (Striking Rescue 2024). టోనీ జా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రతీకారం, మార్షల్ ఆర్ట్స్ పోరాటాలు, క్రిమినల్ గ్యాంగ్ ల మధ్య జరిగే హింసాత్మక పోరును ఏ ఓటీటీలో చూడొచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…
మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు బాయి ఆన్. జీవితం అతని భార్య, కూతురి హత్యతో ఒక్కసారిగా మారిపోతుంది. తనకు ప్రాణమైన కుటుంబాన్ని కోల్పోయిన అతను ఆ బాధ నుంచి బయట పడలేకపోతాడు. ఈ హత్యల వెనుక క్రూరమైన క్రిమినల్ గ్యాంగ్ ఉందని తెలుసుకున్న తర్వాత, తన కుటుంబాన్ని చంపిన వారిని వెతికి పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అలా మొదలైన అతని వేట క్రమంగా ప్రమాదకరమైన మలుపులు తిరుగుతుంది. నేరగాళ్ల నెట్‌వర్క్ లోకి వెళ్లి, తన కుటుంబం మరణానికి కారణమైన వ్యక్తుల దగ్గరకు చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతని లక్ష్యం కేవలం నిందితులను కనుక్కోవడమే కాకుండా, వాళ్లకు తగిన శిక్ష వేయాలని అనుకుంటాడు. తనకు ఎదురయ్యే గ్యాంగ్ సభ్యులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతాడు.
ఈ పోరాటంలో మరో కీలకమైన పరిణామం చోటుచేసుకుంటుంది. తనకు శత్రువుగా భావిస్తున్న వ్యక్తికి చెందిన టీనేజ్ కూతురు టింగ్ ను బాయి ఆన్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఆమెను కాపాడేందుకు బాడీగార్డ్ వూ జెంగ్ రంగంలోకి దిగుతాడు. అప్పటి వరకు ప్రతీకారం కోసం సాగిన బాయి ఆన్ ప్రయాణం, ఇతరుల జీవితాలను కూడా ప్రభావితం చేసే పరిస్థితికి చేరుకుంటుంది. అతను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలడా ? ఈ ప్రతీకార వేటలో ఇంకా ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి ? అనేదే కథలో ఉత్కంఠను పెంచుతుంది.
‘స్ట్రైకింగ్ రెస్క్యూ’ ప్రస్తుతం జియో హాట్స్టార్ (Jio Hotstar)లో అందుబాటులో ఉంది. టోనీ జా యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ ఇష్టపడేవారు ఈ సినిమాను డోంట్ మిస్.