E-Paper
Advertisement

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!
Advertisement

Rajampet Clash: రాజంపేటలో రాజకీయ ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి నివాసంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి దిగినట్లు సమాచారం. అమర్నాథ్ రెడ్డి కారును మొత్తం ధ్వంసం చేసి టీడీపీ నాయకులు నిప్పంటించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలతో ఆగ్రహానికి గురైన టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకుని దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఫర్నిచర్ ద్వసం..

ఈ ఘటనలో ఇంటి వద్ద ఉన్న కారుకు నిప్పంటించినట్లు సమాచారం. అంతేకాకుండా ఇంట్లోని ఫర్నిచర్, అద్దాలు, కుర్చీలు సహా పలు వస్తువులను ధ్వంసం చేసినట్లు అక్కడి అధికారుల తెలిపారు. ఇప్పటికే నామినేషన్ల సందర్భంగా రాజంపేటలో చోటుచేసుకున్న ఘర్షణలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతుండగా తాజాగా ఎమ్మెల్యే నివాసంపై దాడి ఘటన పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

చర్యలు తీసుకుంటారా..

Advertisement

ఎన్నికల పోటీ కాస్తా.. పరస్పర దాడులకు దారితీస్తోందా? రాజంపేటలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటి? రాజకీయ విభేదాలు హింసాత్మక ఘటనలకు దారితీయడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు బాధ్యులపై ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఘటనకు సంబంధించిన వివరాలు, నష్టం, బాధ్యులపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

Also read: ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

Tags

Related News

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

Big Stories

Advertisement
×