E-Paper
Advertisement

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!
Advertisement

Political Controversy: జేడీయూ ఎమ్మెల్యే అనంత కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యలు.. బిహార్ రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోసం తాను ఏకంగా తొమ్మిది మందిని హత్య చేసినట్లు ఆయన బహిరంగంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

వచ్చే శాసనమండలి ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థి అయిన నీరజ్ కుమార్‌కు జేడీయూ టికెట్ కేటాయించడంపై అనంత కుమార్ సింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ప్రత్యర్థిపై విరుచుకుపడుతూ ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నితీష్ కుమార్‌తో నాకు చాలా కాలం నుంచి అనుబంధం ఉంది. ఆయనకు సహాయం చేయడానికి నేను తొమ్మిది మంది హత్యలకు సూత్రధారిగా వ్యవహరించాను. ఆయన రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో నేను అండగా నిలిచాను’ అని సింగ్ పేర్కొన్నారు. తనతో విభేదాలున్న వ్యక్తికి పార్టీ ఎలా నామినేషన్ ఇస్తుందని ఈ సందర్భంగా నీరజ్ కుమార్‌ ప్రశ్నించారు.

Advertisement

నితీష్ కుమార్‌పై విమర్శల దాడి

ఈ వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) తీవ్రంగా స్పందించింది. మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేసింది. ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. ‘అనంత కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆయన చేసిన రాజకీయ నేరాలకు నిదర్శనం. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఈ హత్యలు జరిగాయి. నేరస్థులతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారానే నితీష్ బీహార్‌లో అధికారాన్ని కూడగట్టుకున్నారు’ అని తీవ్రంగా ఆరోపించారు.

స్పందించిన జేడీయూ

Advertisement

మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో జేడీయూ స్పందించింది. ఆ పార్టీ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. నితీష్ కుమార్ ఎలాంటి నేరాలతో సంబంధం లేకుండా పారదర్శకమైన రాజకీయాలు చేశారన్నారు. ఇలాంటి ప్రకటనలు ప్రజల దృష్టిలో ఎలాంటి ప్రాముఖ్యత సంతరించుకోవని ఆయన అభిప్రాయపడ్డారు.

అనంత కుమార్ సింగ్ యూటర్న్..

అయితే తన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీయడంతో అనంత కుమార్ సింగ్ వెనక్కి తగ్గారు. ఈసారి నితీష్ కుమార్‌కు బదులుగా లాలూ ప్రసాద్ యాదవ్‌పై విమర్శలు గుప్పిస్తూ మరో వెర్షన్ చెప్పారు. ‘నేను నా ప్రత్యర్థి నీరజ్ కుమార్‌ను ఉద్దేశించి గతంలో మేము చేసిన త్యాగాల గురించే మాట్లాడాను. లాలూ యాదవ్ ప్రభుత్వ హయాంలో నా అనుచరులు తొమ్మిది మంది హత్యకు గురయ్యారు. నేనూ కాల్పులకు గురయ్యాను. మేము నితీష్ కుమార్‌కు మద్దతుగా నిలిచామనే లాలూ యాదవ్ వారిని హత్య చేయించారు’ అని వివరణ ఇచ్చారు.

Also Read: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

ఎన్నికల వేళ వేడెక్కిన రాజకీయం

బిహార్‌లో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. బిహార్ శాసనమండలిలోని ఎనిమిది స్థానాలకు అక్టోబర్ 23న ఉప ఎన్నిక జరగనుండగా.. అక్టోబర్ 27న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సరిగ్గా ఎన్నికల సమయాన వచ్చిన ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

Tags

Related News

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

Big Stories

Advertisement
×