England Cricketers At Pakistan: ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక మధ్య రేపటి నుంచి వన్డే ట్రై సిరీస్ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఊహించని పరిణామం ఎదురైంది. ఇస్లామాబాద్ లో ఇంగ్లాండ్ క్రికెటర్లు బస చేస్తున్న హోటల్ పక్కన భారీ పేలుడు శబ్దాలు వినబడినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ఉగ్రవాదులు బ్లాస్టింగ్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ శబ్దాలు విన్న ఇంగ్లాండు క్రికెటర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారని తెలుస్తోంది. అనవసరంగా పాకిస్తాన్ పర్యటనకు వచ్చాము కదరా అని వాపోతున్నారని తెలుస్తోంది. తమకు వెంటనే హై సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వన్డే ట్రై సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ పర్యటనకు ఇంగ్లాండ్ క్రికెటర్లు నిన్న వెళ్లారు. లండన్ లో ఫ్లైట్ ఎక్కిన ఇంగ్లీష్ క్రికెటర్లు ఇస్లామాబాద్ లో దిగారు. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో ఇస్లామాబాద్ లోనే బస చేస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో హోటల్ పక్కనే బ్లాస్టింగ్ సౌండ్స్ రావడంతో ఇంగ్లాండ్ క్రికెటర్లు ఉలిక్కిపడినట్టు తెలుస్తోంది. దీంతో ఉగ్రవాదులు దాడులు చేశారని ప్రచారం కూడా సాగింది. దీనిపై వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు చేసి… తమ క్రికెటర్లకు సెక్యూరిటీ పెంచాలని కోరింది.
ఈ శబ్దాలపై వెంటనే పాకిస్తాన్ ఉన్నతాధికారులు విచారించే పెట్టారు. ఇస్లామాబాద్ లో ఇంగ్లాండ్ క్రికెటర్లు బస చేస్తున్న హోటల్ పక్కన ఓ చిన్న టీ కొట్టులో సిలిండర్ పేలినట్టు గుర్తించారట. ఆ హోటల్ లో వినియోగించే సిలిండర్ పేలడంతో శబ్దాలు భారీగా వచ్చినట్టు అధికారులు తేల్చినట్టు సమాచారం. అయితే దీన్ని ఉగ్రవాదుల దాడిగా భావించిన ఇంగ్లాండ్ క్రికెటర్లు, భయభ్రాంతులకు గురి అయినట్టు పాకిస్తాన్ అధికారులు తేల్చినట్టు చెబుతున్నారు. వదంతులు నమ్మకూడదని… ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటామని పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి ప్రకటన చేసిందని అంటున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్తాన్ మధ్య ట్రై సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మూడు జట్ల మధ్య మొత్తం 7 వన్డేలు జరగనున్నాయి. ఇందులో అత్యధిక పాయింట్లు సాధించిన రెండు జట్లు అక్టోబర్ 31వ తేదీన లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా ఫైనల్స్ ఆడతాయి. అందులో గెలిచిన జట్టుకు ట్రోఫీ అందిస్తారు.