E-Paper
Advertisement

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!
Advertisement

Salur Jana Sena: సాలూరు జనసేనలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక చిచ్చు రేపుతోంది. టికెట్ కేటాయింపుపై స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనలోకి వచ్చిన గొల్లి విజయ్‌కుమారి కు చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించడంపై స్థానిక నేతలు అభ్యంతరం తెలిపారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న నాయకులను సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

రాజీనామా చేస్తాం..

స్థానిక నేతల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా సమిష్టిగా పనిచేసి గెలిపించేందుకు సిద్ధమని, ప్రస్తుత నిర్ణయంపై మాత్రం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే చైర్మన్ స్థానాన్ని టీడీపీకే కేటాయించినా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. అధిష్టానం వెంటనే స్పందించి అభ్యర్థి ఎంపికపై నిర్ణయం మార్చుకోకపోతే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు.

రాజకీయంగా చర్చ..

Advertisement

మొత్తానికి సాలూరు మున్సిపల్ ఎన్నికల వేళ జనసేనలో అభ్యర్థి ఎంపిక వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు నాయకులు జనసేన అధిష్టానం మాట వింటారా లేక రాజీనామా చేస్తారో వేచి చూడాలి.

Also read: ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Tags

Related News

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

Big Stories

Advertisement
×