YS Sharmila: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకుంటున్న ఘర్షణలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీకార రాజకీయాలతో రతనాల సీమను రక్తసీమగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఘర్షణలు, దాడులతో రణరంగంగా మారుస్తున్నారని ఆక్షేపించారు. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ను మరో ‘సౌత్ బీహార్’గా మార్చే పరిస్థితులు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.
శుక్రవారం రాయచోటి, పుంగనూరులో చోటుచేసుకున్న ఘటనలు రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే అత్యంత ఆందోళనకరమైన పరిణామాలుగా షర్మిల అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో కక్ష్య సాధింపు రాజకీయాలకు, రక్తపాతానికి తావులేదని స్పష్టం చేశారు. రాజకీయాలంటే ప్రజల అభివృద్ధి కోసం పోటీ పడాలే కానీ, భౌతిక దాడులకు పాల్పడటం కాదని సూచించారు. అధికారాన్ని అడ్డుపెట్టి టీడీపీ సాగిస్తున్న ఈ దౌర్జన్య వైఖరిని ఏపీ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు.
ఎన్నికల వేళ @JaiTDP TDP, @YSRCParty YCPలు సాగిస్తున్నది దాష్టీక రాజకీయాలు. నాడు YCP హయాంలో హింసాకాండ.. నేడు TDP హయాంలో అంతకుమించిన ఘోరకలి!
ప్రతీకార రాజకీయాలతో రతనాల సీమను రక్తసీమగా మారుస్తున్నారు.నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఘర్షణలు, దాడులతో రణరంగంగా మారుస్తున్నారు.అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ను మరో ‘సౌత్ బీహార్’గా మార్చే పరిస్థితులు సృష్టిస్తున్నారు. నిన్న రాయచోటి, పుంగనూరులో చోటుచేసుకున్న ఘటనలు రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఆందోళనకరమైన పరిణామాలు.
ప్రజాస్వామ్యంలో కక్ష్య సాధింపు రాజకీయాలకు, రక్తపాతానికి తావులేదు. రాజకీయాలంటే ప్రజల అభివృద్ధి కోసం పోటీ పడాలి కానీ, భౌతిక దాడులకు పాల్పడటం కాదు. అధికారాన్ని అడ్డుపెట్టి TDP సాగిస్తున్న ఈ దౌర్జన్య వైఖరిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
కూటమిది @ncbn @JanaSenaParty @BJP4Andhra నిజంగా పవిత్ర పాలనే అయితే, దాడులు ఎందుకు? బలవంతపు ఏకగ్రీవాలు ఎందుకు? నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమెందుకు?
ఐదు అంచెల భద్రత ఉండాల్సిన నామినేషన్ కేంద్రాల వద్ద కిరాయి రౌడీలు, గూండాలు స్వైరవిహారం చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోంది?శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు శాఖ బాధ్యత ఏమైంది? అధికార పార్టీకి అండగా నిలిచి, ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితులను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు?
రాష్ట్ర ఎన్నికల సంఘానికి మా డిమాండ్లు:
🔹 స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలి.
🔹 ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి.
🔹 అర్హత, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించాలి.
🔹 బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకుని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేలా చూడాలి.
🔹 ఎన్నికలతో సంబంధం లేని ఇతర ప్రాంతాల వ్యక్తులు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగ కావాలి.. పగలు, ప్రతీకారాలకు వేదిక కాకూడదు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రతి అభ్యర్థికి సమాన అవకాశం కల్పించడం ఎన్నికల సంఘం బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించి, ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలి.
@INC_Andhra— YS Sharmila (@realyssharmila) October 17, 2026
కూటమి చేసేది నిజంగా పవిత్ర పాలనే అయితే ఈ దాడులు ఎందుకని షర్మిల ప్రశ్నించారు. ‘బలవంతపు ఏకగ్రీవాలు ఎందుకు? నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమెందుకు? ఐదు అంచెల భద్రత ఉండాల్సిన నామినేషన్ కేంద్రాల వద్ద కిరాయి రౌడీలు, గూండాలు స్వైరవిహారం చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు శాఖ బాధ్యత ఏమైంది? అధికార పార్టీకి అండగా నిలిచి, ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితులను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు?’ అని షర్మిల నిలదీశారు.
Also Read: రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!
మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎదుట కాంగ్రెస్ తరపున కొన్ని డిమాండ్లను సైతం షర్మిల ఉంచారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించాలన్నారు. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకుని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేలా చూడాలన్నారు. ఎన్నికలతో సంబంధం లేని ఇతర ప్రాంతాల వ్యక్తులు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రతి అభ్యర్థికి సమాన అవకాశం కల్పించడం ఎన్నికల సంఘం బాధ్యత అని షర్మిల గుర్తుచేశారు.
Also Read: జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ