Private Videos Leaked: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎపిసోడ్ సంచలనమవుతున్నది. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనను చెల్లి చెల్లి అని పిలిచి లోబర్చుకున్నాడని బాధితురాలు హైదరాబాద్‌లో వీడియో సమావేశంలో సంచలన ఆరోపణలు చేసింది. ఓ హోటల్‌లో తనపై బలవంతంగా లైంగికవేధింపులకు పాల్పడ్డాడని చెబుతూ అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వ్యవహారంపై బిగ్ టీవీ సదరు ఎమ్మెల్యేను వివరణ అడిగింది. ఈ వీడియోపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పందించాడు.
సత్యవేడు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కోనేటి ఆదిమూలం కోసం టీడీపీ కార్యకర్తగా తాను ప్రచారం చేశానని, ఆ సమయంలోనే తన నెంబర్ ఎమ్మెల్యే ఆదిమూలం తీసుకున్నాడని బాధితురాలు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియాకు వెల్లడించింది. ఆ తర్వాత వాట్సాప్‌లో కాల్ చేయడం మొదలు పెట్టాడని తెలిపింది. ఓ సారి సడెన్‌గా కాల్ చేసి బీమా ప్యారడైస్ హోటల్‌కు రావాలని, ఒక ముఖ్యమైన పని ఉన్నదని చెప్పినట్టు వివరించింది. ఎమ్మెల్యే పిలవడంతో నిజంగానే ఏదో ముఖ్యమైన పని ఉండి ఉంటుందని హడావుడిగా బయల్దేరి కారు బుక్ చేసుకుని తాను వెళ్లానని బాధితురాలు తెలిపింది. అక్కడికి వెళ్లితే ఎమ్మెల్యే ఒక్కడే ఉన్నాడని, ఇతర నాయకులు, లేదా బందోబస్తు, పోలీసులు ఎవరూ లేరని పేర్కొంది.
జులై 6వ తేదీన 109 రూమ్ డోర్ తట్టగానే తలుపు తీసి తనను లోనికి తీసుకుని వెంటనే డోర్ క్లోజ్ చేశాడని వివరించింది. ఆ తర్వాత అసభ్యంగా టచ్ చేశాడని, అనంతరం, బలవంతంగా తనపై లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే మొత్తం కుటుంబానికే ముప్పు ఉంటుందని బెదిరించాడని పేర్కొంది. దీంతో భయపడి ఎవరికి చెప్పకుండా ఇంటికి తిరిగి వచ్చానని వివరించింది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ ఫోన్లు చేయడం మొదలు పెట్టాడని, వాట్సాప్ కాల్ చేసి ఇబ్బంది పెట్టేవాడని పేర్కొంది. తరుచూ ఫోన్ చేయడంతో తన భర్త గమనించి.. ఎమ్మెల్యే ఎందుకు తరుచూ ఫోన్ చేస్తున్నాడని ప్రశ్నించాడని, ఆ తర్వాత తన భర్త కూడా ఇబ్బంది పెట్టాడని తెలిపింది. దీంతో అసలు విషయం తన భర్తకు చెప్పానని, ఎమ్మెల్యే తనను బలవంతంగా రేప్ చేశాడని వివరించగా… భర్త బాధపడ్డాడని చెప్పింది.
ఇంకా ఎవరైనా ఇలా ఎమ్మెల్యే చేతిలో మోసపోతున్నారా? అని తన భర్త అడిగాడని, ఇంకా చాలా మంది మహిళలు, అధికారులు సహా ఎమ్మెల్యే చేతిలో ఇలా లైంగిక దాడులు, వేధింపులకు గురవుతున్నారని చెప్పానని పేర్కొంది. దీంతో తన భర్త ఒక పెన్ కెమెరా ఇచ్చాడని, అది తీసుకుని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లానని, అప్పుడు కూడా ఎమ్మెల్యే బలవంతంగా తనపై దాడి చేశాడని, ఆ వీడియో రికార్డ్ అయిందని వివరించింది.
Also Read: Tdp high command serious: టీడీపీ హైకమాండ్ ఆగ్రహం.. ఎమ్మెల్యే ఆదిమూలంపై వేటు
ఈ విషయాన్ని తాను పెదబాబు చంద్రబాబు, చినబాబు లోకేశ్‌కు కూడా ఉత్తరాల ద్వారా తెలియజేశానని, వారు ఎమ్మెల్యే ఆదిమూలంపై యాక్షన్ తీసుకుంటారనే ఇప్పటి వరకు వేచి చూశానని బాధితురాలు తెలిపింది. కానీ, ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రయోజనం ఉండేది కాదని, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేపై వారు యాక్షన్ తీసుకుంటారని తాను అనుకోలేదని, అందుకే చంద్రబాబుకు విషయం చేరవేశానని వివరించింది.
తాను కూడా టీడీపీ పార్టీ సభ్యురాలనేని, పార్టీ నష్టపోవాలని తాను అనుకోవడం లేదని, కానీ, ఇలాంటి కామాంధులు పార్టీలో ఉంటే మాత్రం మంచి పేరు రాదని బాధితురాలు పేర్కొంది. వెంటనే ఆయనపై యాక్షన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆయనపై చంద్రబాబే యాక్షన్ తీసుకోవాలని ఇప్పటికీ తాను కోరుకుంటున్నాని పేర్కొంది.
ఆ తర్వాత టీడీపీ హైకమాండ్ ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలం సెక్స్ వీడియోతో దొరికిపోయాడు. తనను బెదిరించి లైంగికంగా వాడుకున్నారని బాధితురాలు ఆరోపించింది. చెల్లి, చెల్లి అంటూనే దారుణానికి తెగబడ్డారని పేర్కొంది. జూలై 6న తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను… pic.twitter.com/mZMurNPwGT
— ChotaNews (@ChotaNewsTelugu) September 5, 2024
ఈ ఆరోపణలు, వీడియోల నేపథ్యంలో బిగ్ టీవీ.. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను సంప్రదించి దీనిపై స్పందించాలని కోరింది. బిగ్ టీవీతో ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ.. ‘నేను ప్రజా సేవకుడిని. కింది స్థాయి నుంచి వచ్చిన వాడిని. ప్రజలకు 50 ఏళ్లుగా సేవ చేస్తున్నాను. నా దగ్గరికి వచ్చిన వారికి సహాయ చేసి పంపుతాను. అంతే తప్పితే తాను ఏ తప్పూ చేయలేదు. చేయబోను’ అని చెప్పారు. ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. అదంతా కొందరు కలిసి తనపై పన్నుతున్న కుట్ర అని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. గిరి, రమేశ్ ఇంకా కొందరు మాఫియాగా మారారని, వారితో ఈమె కూడా చేరిందని, వీరంతా కలిసి తనపై కుట్ర చేస్తున్నారని
ఆరోపించారు.
‘నేను ఎప్పుడూ ఆమెను వేధించలేదు. ఒక్క మాట కూడా అనలేదు. ఆమెను ఒక సిస్టర్‌గానే భావించాను. ఆమె మహిళా కార్యకర్త. ఆమె రావడం, పోవడం, మీటింగులు, పార్టీ కార్యక్రమాలు తప్పితే తాను ఏమీ చేయలేదు. ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దేవుడి సాక్షిగా, బిడ్డల సాక్షిగా చెబుతున్నా.. నేను ఆమెను వేధించలేదు’ అని ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు.
Also Read: Vijayawada Floods: ఈ వరదలకే విజయవాడ విలయవాడగా ఎందుకు మారింది ?
ఆమె ఏకంగా వీడియో కూడా విడుదల చేసిందని పేర్కొనగా.. అదంతా కేవలం కుట్ర అని.. తాను అమాయకుడినని, తాను ఏ తప్పూ చేయలేదని ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు. అది ఎలా మార్ఫింగ్ చేశారో తనకు తెలియదని చెప్పారు. ‘పైన దేవుడు ఉన్నాడు. ధర్మం ఉన్నది. నీతి గెలుస్తుంది’ అని వివరించారు. ఏ వివరాలు అడిగినా.. ఆమెనే అడగాలని పేర్కొన్నారు. ఆమె ఆల్రెడీ చెప్పిందని, మీ వివరణ కావాలని అడగ్గా.. ఆమెను తనను ఫేస్ టు ఫేస్ అడిగితే చెబుతానన్నారు.