BhagyaShri Bhorse Photos| మిస్టర్ బచ్చన్ లో మెరుపు తీగలా కనిపించిన యువనటి భాగ్యశ్రీ బోర్సే తాజాగా హాట్ ఫొటో షూట్ చేసింది.


డెనిమ్ షార్ట్స్ లో ఈ చార్మింగ్ బ్యూటీ క్యూట్ లుక్స్ తో పోజులిచ్చింది.

తెలుగులో నెక్స్ ట్ బిగ్ థింగ్ గా సినీ విమర్శకులు ఈ మరాఠీ భామ వైపు చూస్తున్నారు.

మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో జన్మించిన భాగ్యశ్రీ హిందీ, తెలుగు సినిమాలో నటిస్తోంది.

2023లో వచ్చిన హిందీ సినిమా యారియా 2 లో ఒక అతిధి పాత్రలో కనిపించి అందరి చూపు తనవైపు తిప్పుకుంది.

ఆ తరువాత బాలీవుడ్ యువనటుడు కార్తిక్ ఆర్యన్ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో జర్నలిస్ట్ గా కనిపించింది.

కానీ పూర్తిస్థాయిలో భాగ్యశ్రీకి హీరోయిన్ గా హిందీలో అవకాశాలు రాలేదు. 2024లో తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో రవితేజ సరసన భాగ్యశ్రీ నటించింది

ఈ సినిమాలో భాగ్యశ్రీ అందాలకు అందరూ ఫిదా అయ్యారు. అయితే మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో భాగ్యశ్రీ ఇక తన ఆశలన్నీ విజయ్ దేవరకొండ సినిమాపై నే పెట్టుకుంది.