Tdp high command serious: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై ఇంటా బయటాపై విమర్శలకు ఛాన్స్ ఇవ్వకూడదని భావించింది. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు.
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ హైకమాండ్. ప్రస్తుతం అజ్ఞాతంలో వున్నారు ఎమ్మెల్యే ఆదిమూలం. ఆయన ఇంటి వద్ద నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే రొమాంటిక్ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఫోన్ పని చేస్తున్నప్పటికీ, ఆయన లిఫ్ట్ చేయలేదు. నేరుగా బాధితురాలు మీడియా ముందుకురావడంతో హైకమాండ్ కొరడా ఝులిపించింది.
ALSO READ: బుడమేరును నదితో పోల్చిన జగన్..నెటిజన్స్ ట్రోలింగ్
గురువారం ఉదయం నుంచి ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం రచ్చ అవుతోంది. బాధితురాలు నేరుగా ఎమ్మెల్యేకు సంబందించిన వీడియోలను బయటపెట్టింది. ఈ వ్యవహారంపై అప్పటికే టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. దీనిపై నివేదిక ఇవ్వాలని హైకమాండ్ ఆదేశించింది. కేవలం రెండు గంటల వ్యవధిలో ఎమ్మెల్యేపై వేటు వేసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఎమ్మెల్యేపై వేటు వేసింది.
ఎమ్మెల్యే ఆదిమూలం వైసీపీ నుంచి టీడీపీలోకి రావడాన్ని తాను ముందు నుంచే వ్యతిరేకించానని బాధితురాలు మనసులోని మాట బయటపెట్టింది. అయినా సరే పార్టీ అధిష్టానం అతన్ని చేర్చుకోవడంతో పార్టీ విజయం కోసం పని చేశానని వెల్లడించింది.
టీడీపీ సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తీవ్రమైన ఆరోపణలు చేసింది బాధితురాలు. కొన్ని ప్రైవేటు వీడియోలు రిలీజ్ చేసింది. ఆ తర్వాత నేరుగా ఆమె మీడియా ముందుకొచ్చింది. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో తన భర్తతో కలిసి మీడియా ముందుకొచ్చింది. ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారాన్ని బయటపెట్టింది.
తిరుపతిలోని బీమాస్ హోటల్‌లో తనపై లైంగిక వేధింపులకు దిగినట్టు బాధితురాలు తెలిపింది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లానని, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు లేఖ రాసినట్టు తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఎమ్మెల్యే తనపై బెదిరింపులకు దిగినట్టు తెలియజేసింది. తాను టీడీపీకి చెందినవారమేనని వెల్లడించింది.
ఎమ్మెల్యే ఆదిమూలం తనపై మూడుసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపింది బాధితురాలు. ఎమ్మెల్యే నిజస్వరూపాన్ని పెన్ కెమెరాతో బట్ట బయలు చేసింది. తన కోరిక తీర్చకుంటే కుటుంబా న్ని అంతం చేస్తానంటూ బెదిరించారని కంటతడి పెట్టుకుంది.
రోజుకో అమ్మాయితో ఎమ్మెల్యే ఎంజాయ్ చేసేవాడని, అందమైన అమ్మాయి కనబడితే తనతో గడపాల్సిందేనని భావించేవాడని తెలియజేసింది. తనలాగే ఎంతోమందిని టార్చర్ చేశాడని, ఇలాంటి వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఆదిమూలం కామంధుడు, రాక్షసుడని చెప్పుకొచ్చింది.
రాసలీలల వ్యవహారంపై ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. ఆ వీడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని, మార్పింగ్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఆ వీడియో ఎలా వచ్చిందో దేవుడికే తెలియాలన్నారు. చివరకు సమాచారం సేకరించిన టీడీపీ హైకమాండ్, ఎమ్మెల్యే ఆదిమూలంపై కొరడా ఝులిపించింది. చివరకు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ వేటు వేసింది. ఓ మహిళపై అత్యాచారం చేశారనే వీడియోలు బయటకు రావడంతో చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. ఇలాంటి వాటిని సహించేది లేదని హెచ్చరించారు. https://t.co/1FG8lXWuIK pic.twitter.com/zL5zl153pN
— ChotaNews (@ChotaNewsTelugu) September 5, 2024
24. ‘టీడీపీ ఆఫీసు ముందే ఆత్మహత్య చేసుకుంటా’
టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనపై అత్యాచారం చేసి వేధిస్తున్నాడని ఓ మహిళ ఆరోపించింది. ఈ విషయాన్ని గతంలోనే సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించింది. తనకు ఆదిమూలం నుంచి ప్రాణ హాని ఉందని తెలిపింది. సీఎం స్పందించి న్యాయం… https://t.co/1FG8lXVWTc pic.twitter.com/RdyAvH19QU
— ChotaNews (@ChotaNewsTelugu) September 5, 2024