BigTV English

Maddali Giri: గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేకు షాక్.. నియోజకవర్గ ఇంఛార్జ్ గా మంత్రి విడదల రజిని

Maddali Giri: గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేకు షాక్.. నియోజకవర్గ ఇంఛార్జ్ గా మంత్రి విడదల రజిని

Maddali Giri: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరి రెంటికి చెడ్డ రేవడిగా మారారా? గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఆయన.. వైసీపీ అధికారంలోకి రాగానే జెండా మార్చారు. సైకిల్‌కు గుడ్‌బై చెప్పి.. అసెంబ్లీలో వైసీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే.. ఇప్పుడాయన నియోజకవర్గానికి వైసీపీ ఇంఛార్జ్‌గా మంత్రి విడదల రజినీని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది మద్దాలి గిరికి బిగ్ షాక్‌గా మారింది.


గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈసారి వైసీపీ టికెట్‌పై తాను పోటీ చేస్తానంటూ ఇప్పటికే చెప్పుకున్నారు ఎమ్మెల్యే మద్దాలి గిరి. కానీ చిలకలూరిపేటలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రి విడదల రజినీని సడెన్‌గా గుంటూరు వెస్ట్ వైసీపీ ఇంఛార్జ్‌గా జగన్ ప్రకటిచండంతో మద్దాలి గిరి తేరుకోలేకపోతున్నారు. ఆయన టికెట్ ఆశలు గల్లంతయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనేది డైలమాలో పడింది.

ఎమ్మెల్యే మద్దాలి గిరికి న్యాయం చేయాలంటూ ఆర్యవైశ్య సామాజికవర్గం నాయకులు రోడ్డెక్కారు. గుంటూరులో రోడ్డుపై బైఠాయించిన ఆందోళన చేస్తున్నారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా మంత్రి విడదల రజినీ నియామకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గం నాయకులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.


.

.

Related News

Pulivendula Slips: బ్యాలెట్ బాక్స్ లో ఓటుతోపాటు స్లిప్పులు కూడా.. పులివెందుల ఓటర్ల మనోగతం ఏంటంటే?

AP Heavy Rains: ఏపీని ముంచెత్తిన భారీ వరదలు.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

Polavaram: పోలవరంపై కీలక అప్ డేట్.. మంత్రి లోకేష్ ఆసక్తికర ట్వీట్

Fact Check AP: అడ్డంగా ఇరుక్కున్న అంబటి? బిగ్ షాకిచ్చిన fact check!

AP Heavy rain alert: అల్పపీడనం ఆగ్రహం.. మూడు రోజులు భీకర గాలులు, జోరు వర్షాలు.. ఎక్కడంటే?

Pulivendula Victory: జగన్‌కు మరిన్ని షాకులు.. పులివెందుల విక్టరీపై సీఎం చంద్రబాబు రియాక్షన్

Big Stories

×