Little Hearts 2: ఇటీవల కాలంలో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది అంటే తప్పనిసరిగా నిర్మాతలు ఆ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని(Sequel Movie) ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు సీక్వెల్, ఫ్రీక్వెల్ అంటూ తెగ హడావిడి చేసేస్తున్నాయి. అయితే తాజాగా ఈ సీక్వెల్స్ జాబితాలోకి మరో హిట్ సినిమా చేరిపోయింది. ఇటీవల సాయి మార్తాండ్(Sai Marthand) దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం లిటిల్ హార్ట్స్ (Little Hearts). మౌళి తనూజ్(Mouli Tanuj), శివాని నాగారం(Shivani Nagaram) జంటగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా సెప్టెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా విడుదల సమయంలో అనుష్క, శివ కార్తికేయన్ వంటి స్టార్ సెలబ్రిటీల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఆ సినిమాలను వెనక్కి నెట్టి మరి లిటిల్ హార్ట్స్ అందరి హృదయాలను దోచుకుందని చెప్పాలి. ఇలా థియేటర్లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఈటీవీ విన్ (Etv Win) లో ప్రసారానికి సిద్ధమవుతుంది. ఇలా ఈ సినిమా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ సినిమా మొదటి భాగం ఎంతో మంచి సక్సెస్ కావడంతో త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.లిటిల్ హార్ట్స్ 2(Little Hearts 2) చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్ లు విభిన్న రీతిలో సందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక సినిమా హిట్ అయితే చాలు వెంటనే సీక్వెల్ ప్రకటించడం ఆనవాయితీగా మారిపోయిందంటూ కామెంట్లు చేయగా మరికొందరు అవసరమా సీక్వెల్ అంటూ స్పందిస్తున్నారు.
90’s వెబ్ సిరీస్..
మరి కొంతమంది సీక్వెల్ సినిమా చేసి మంచి హిట్ సినిమాని దయచేసి చెడగొట్టకండి అంటూ ఈ వార్తలపై కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా సీక్వెల్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే ఈ విషయంపై చిత్ర బృందం అధికారకంగా స్పందించాల్సి ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఫుడ్ వీడియోస్ చేస్తూ కరోనా సమయంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న మౌళి అనంతరం సినిమాలలో అవకాశాలను అందుకుంటూ వచ్చారు. ఇక ఈయన 90′ s వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇక లిటిల్ హార్ట్స్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో మౌళికి ఇండస్ట్రీలో మరింత క్రేజ్ ఏర్పడింది.
Also Read: Sobhita: సమంతపై పొగడ్తల వర్షం.. శోభితా దూళిపాళ ఇంత గొప్పగా ఆలోచిస్తుందా?