ఈ రోజుల్లో సోషల్ మీడియా వేదికగా చాలా మంది పాపులారిటీ సంపాదిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన క్రేజీ వీడియోలను షేర్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ అమ్మాయి కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉంది? ఎందుకు ఆ వీడియో వైరల్ అయ్యింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్‌కు చెందిన మహి సింగ్ ఇన్ స్టాలో ‘బ్యూటీ క్వీన్’గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనుగులు చేసేందుకు తన యూజర్లు డబ్బుపు పంపించాలని కోరింది. చెప్పడమే కాదు, తన ఫోన్ పే క్యూఆర్ కోడ్ ను షేర్ చేసింది. తాను ఐఫోన్ ను కొనుగోలు చేసేందుకు ఎవరికి నచ్చినంత వాళ్లు సాయం చేయాలని కోరింది. ఒక్కొక్కరు రూ. 1, 2 లేదంటే ఎవరికి నచ్చినంత వాళ్లు పంపించాలని కోరింది. తన తండ్రి ఇటీవల తనకు ఐఫోన్ 16 కొనుగోలు చేశాడని, ఇప్పుడు మళ్లీ కొత్త ఫోన్ కొనాలంటే నో చెప్పాడని మహి వివరించింది. అక్టోబర్ 21న తన పుట్టిన రోజు సమీపిస్తుండటంతో.. ఆరోజున తాను కొత్త ఐఫోన్ ను కొనాలి అనుకుంటున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర ఇండియాలో దాదాపు రూ. 1.49 లక్షలు ధర పలుకుతోంది.
लखीमपुर की ब्यूटी क्वीन माही सिंह एक एक,दो दो रुपये मांग रही है 17 प्रो मैक्स फोन लेने के लिए….. pic.twitter.com/YvpoJymsH9
— Sajid Ali (@Sajid7642) September 25, 2025
Read Also: ఓర్నీ దుంపతెగ.. ఏంటీ ఇలాంటి సమోసా ఒకటి ఉందా? రుచి చూస్తే అస్సలు వదలరండోయ్!
మహి సింగ్ షేర్ చేసిన ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొంత మంది ఆమెకు సాయం చేస్తామని చెప్తుంటే, మరికొంత మంది సోషల్ మీడియాలో బిచ్చగాళ్లు తయారయ్యారంటూ మండిపడుతున్నారు. “ఇప్పటి వరకు ఆపదలో ఉన్న వాళ్లు క్రౌడ్ ఫండింగ్ చేయడం చూశాం. కానీ, ఇప్పుడు లగ్జరీ కార్లు, ఇళ్లు, ఫోన్లు కొనేందుకు చేస్తున్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. “ఇన్నాళ్లు బయట మాత్రమే బిచ్చగాళ్లు అడుక్కునే వాళ్లు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆ ట్రెండ్ మొదలయ్యింది. జాగ్రత్తగా ఉండాలి” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ మొత్తంగా ఈ వీడియో నెట్టింట కొత్త చర్చకు కారణం అయ్యింది.
Read Also: షాకింగ్.. రైలు నుంచి విడిపోయిన బోగీలు, గంట వ్యవధిలో ఏకంగా రెండుసార్లు!