Prabhas Raja Saab: కొన్ని పాటలు వింటున్నప్పుడు భలే ఆసక్తిగా అనిపిస్తాయి. ఒక పాటను వినే సందర్భం, ఉన్న పరిస్థితి బట్టి కూడా పాట కొన్ని సందర్భాల్లో అర్థమవుతుంది. చాలా పాటలను మనం విని వదిలేస్తుంటాం. కొన్నిసార్లు ప్రయాణాల్లో, ఇంకొన్నిసార్లు సిట్టింగ్స్ లో సడన్ గా కొన్ని లిరిక్స్ మనకు విపరీతంగా కనెక్ట్ అయిపోతాయి. ఇంత మంచి పాటను ఎలా పక్కన పెట్టేసాం అనే ఫీలింగ్ తీసుకొస్తాయి.
ముఖ్యంగా పాట మనిషిని కదిలిస్తుంది అని అంటారు. చాలా సందర్భాలలో సినిమా సూపర్ హిట్ అవ్వడానికి పాటలే ముందుండి నడిపించాయి. అలానే పాటలు హిట్ అయినా కూడా సినిమాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో ఎక్కువగా డీజే ల్లో వినిపించే ఒక పాటను ప్రజెంట్ చేశారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు అయినప్పుడు కొన్ని ఫేమస్ సాంగ్స్ వినిపిస్తాయి. అటువంటి ఫేమస్ సాంగ్స్ లో “రివా రివా” (Riva Riva Song) పాట ఒకటి. అయితే వాస్తవానికి ఈ పాట ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో ఎవరికి ఐడియా లేదు. సోషల్ మీడియా ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో కూడా ఈ పాట ఒరిజినల్ ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి.
ఈ పాట ఇప్పటిది కాదు చాలా సంవత్సరాల క్రితం ఉంది. చాలామందికి ఈ పాట సుపరిచితం. అయితే ఇప్పటికీ కూడా ఇదే పాట పైన చాలా రీల్స్ ఇంస్టాగ్రామ్ లో కనిపిస్తాయి. అలానే డీజే మిక్సింగ్లు కూడా ఈ పాట మీద విపరీతంగా వినిపిస్తాయి. ఈ పాటను రాజా సాబ్ సినిమాలో పెట్టారు.
Also Read : Pawan Kalyan OG : కొద్దిసేపట్లో ఓ జి సినిమా చూడనున్న మెగా ఫ్యామిలీ, ప్రత్యేకించి అక్కడ చూడటానికి కారణం ఇదే
ప్రభాస్ రాజా సాబ్ (The Raja Saab) సినిమాను నార్త్ అమెరికాలో ప్రత్యంగిరా & పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాస్ విడుదల చేస్తున్నాయి. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను కొద్దిసేపటి క్రితమే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన వీడియోలు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే బ్యాక్ గ్రౌండ్లో ‘Riva Riva Song’ సాంగ్ లో టోన్ లో వినిపిస్తుంది. దీనిని బట్టి జనాల్లో బాగా పాపులర్ అయిన పాటను, దర్శకుడు మారుతీ (director Maruti) కి పల్స్ తెలుసు కాబట్టి ఈ సినిమాలో ఇరికించారు అని అర్థమవుతుంది. కాసేపట్లో రిలీజ్ కాబోయే ట్రైలర్ తో మరింత క్లారిటీ వస్తుంది.
#TheRajaSaab’s notice to the North America fort 💥💥
All set for a massive release with @PrathyangiraUS & @peoplecinemas 🔥🔥
From here on, it’s only going to be massive celebrations ❤️❤️#Prabhas @DuttSanjay @DirectorMaruthi @Bomanirani @vishwaprasadtg @SKNOnline… pic.twitter.com/9ntrTgF8OV
— People Media Factory (@peoplemediafcy) September 29, 2025